భార్యను చంపిన కేసులో నిందితుడు: ముగ్గురు అక్కలపై దాడి, ఇద్దరు మృతి

By telugu teamFirst Published Jun 30, 2020, 7:38 AM IST
Highlights

ఓ ఉన్మాది హైదరాబాదులోని పాతబస్తీలో ముగ్గురు అక్కలపై కత్తితో దాడి చేశాడు. వారిలో ఇద్దరు మరణించగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇస్మాయిల్ అనే ఆ యువకుడు భార్యను చంపిన కేసులో నిందితుడు.

హైదరాబాద్: ఓ యువకుడు ఉన్మాదిలా ప్రవర్తించి ముగ్గురు అక్కలపై కత్తితో దాడి చేశాడు. వారిలో ఇద్దరు మరణించగా, ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మూడో అక్కపై దాడి చేసే సమయంలో బావ అడ్డుగా వచ్చాడు. దాంతో బావను పొడిచాడు. నాలుగో అక్కను కూడా చంపాలని అనుకున్నాడు. కానీ కుదరదలేదు. 

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సోమవార రాత్రి ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాదు పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో గల బార్కస్ సలాలలో అహ్మద్ ఇస్మాయిల్ (27) అనే మాజీ బౌన్సర్ తల్లి పుత్రీబేగంతో కలిసి ఉంటున్నాడు. 

సోమవారం ఇంటికి వచ్చిన ఇద్దరు అక్కలు రజియా బేగం, జకీరాబేగంలపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత అర కిలోమీటరు దూరంలోని సబీల్ కాలనీలో ఉంటున్న మూడో అక్క నూరా బేగం ఇంటికి వెళ్లి అమెపై, బావపై దాడి చేశాడు. సమాచారం అందుకున్న అదనపు సీపీ (ట్రాఫిక్) అనిల్ కుమార్ అక్కడికి చేరుకున్నడాు. 

రజియా బేగం అక్కడికక్కడే మరమించింది. జకిరా బేగం కూడా మరణించినట్లు వైద్యులు తేల్చారు. నూరా బేగం, ఉమర్ ఓవైసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు ఇస్మాయిల్ నిరుడు మార్చిలో తన బార్యను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. 

పథకం ప్రకారం దాడి.....

పథకం ప్రకారం ఇస్మాయిల్ తన అక్కలపై దాడి చేశాడు. తల్లికి బాగా లేదని సోమవారం ఉదయం రజియా బేగంకు ఫోన్ చేశాడు. సాయంత్రం మరో జకిరా బేగంకు చెప్పాడు. దాంతో వారిద్దరు ఇంటికి వచ్చారు. సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో అక్కలపై ఇస్మాయిల్ దాడి చేశాడు. ఆ తర్వాత మూడో అక్క ఇంటికి వెళ్లాడు. 

అక్కడి నుంచి నాలుగో అక్క మలికా బేగంను చంపాలని ఆణె ఇంటికి వెళ్లాడు. అక్కను ఆస్పత్రిలో చేర్చారని తెలుసుకుని వారిపై దాడి చేసేందుకు ఓవైసీ ఆస్పత్రికి వెళ్లాడు. పోలీసులను చూసి పారిపోయాడు. ఆస్పత్రికి వెళ్లే సమయంలో అతనికి దారిలో బంధువు కనిపించాడు. తన అక్కలు చెప్పడం వల్లనే తాను భార్యను చంపానని, దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నానని అతనితో చెప్పినట్లు సమాచారం.

ఆదివారం కుటుంబ సభ్యులంతా ఆస్తి పంచుకునేందుకు సమావేశమయ్యారని అంటున్నారు. ఈ సమావేశం ప్రశాంతంగా ముగిసిందని, ఆ తర్వాతనే నిందితుడు హత్యకు పథకం రచించి ఉంటాడని భావిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

click me!