కూతురిని వేధిస్తున్నాడని.. అల్లుడిని చంపిన మామ

Published : Feb 01, 2021, 09:20 AM ISTUpdated : Feb 01, 2021, 09:24 AM IST
కూతురిని వేధిస్తున్నాడని.. అల్లుడిని చంపిన మామ

సారాంశం

జనవరి 29 శుక్రవారం ఉదయం తమ్మున్ని వస్త్ర దుకాణం వద్ద వదిలి వెళ్లాడు.  రాత్రి 10 గంటల 30 నిమిషాల సమయంలో తమ్ముడికి ఫోన్ చేసి కొద్దిసేపట్లో వస్తానని చెప్పాడు.

తమ కన్న కూతురిని పెళ్లైన కొద్ది రోజులకే అల్లుడు వేధించడం, చిత్ర హింసలు పెట్టడం తట్టుకోలేక పోయాడు.  దీంతో.. కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన రాయదుర్గం సమీపంలో చోటుచేసుకోగా... ఈ ఘటకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

టోలిచౌకి ఎండీ లైన్స్ కు చెందిన షేక్ సల్మాన్(25) బ్లాక్ బర్డ్ బ్యూటీ పేరుతో మణికొండ సాయి నగర్ లో లేడీస్ టైలర్ షాపు నిర్వహిస్తున్నాడు.  అతని తమ్ముడు రిజ్వాన్(16) హఫీజ్ పేటలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తుంటాడు. జనవరి 29 శుక్రవారం ఉదయం తమ్మున్ని వస్త్ర దుకాణం వద్ద వదిలి వెళ్లాడు.  రాత్రి 10 గంటల 30 నిమిషాల సమయంలో తమ్ముడికి ఫోన్ చేసి కొద్దిసేపట్లో వస్తానని చెప్పాడు.

ఎంతకీ రాకపోవడంతో అనుమానించి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అదృశ్యం కేసు నమోదు చేశారు. కాగా.. సల్మాన్ ని అతని మామ జిలాని, మరో ముగ్గురు శుక్రవారం రాత్రి కారులో షాపు వద్దకు వెళ్లి సల్మాన్ ని అపహరించి మొయినాబాద్ నక్కలపల్లి చెరువు వద్దకు తీసుకువెళ్లాడు. దారి లో మెడకు ఉరిబిగించారు. ఆ తర్వాత చెరువు వద్ద బండరాయితో కొట్టి చంపేశారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్