రామాలయానికి కేసీఆర్ వ్యతిరేకమా..? రాములమ్మ ప్రశ్న

By telugu news teamFirst Published Feb 1, 2021, 8:46 AM IST
Highlights

అయోధ్య రామాలయం విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భద్రాద్రి ఆలయం గురించి మాట్లాడుతూ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ మహిళా నాయకురాలు విజయశాంతి సోషల్ మీడియా వేదికగా మరోసారి మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయోధ్యకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. వారిని సీఎం కేసీఆర్ ఖండించడం లేదని ఆమె అన్నారు. అంటే..  అయోధ్య రామాలయానికి సీఎం కేసీఆర్ వ్యతిరేకమా.. అని విజయశాంతి ప్రశ్నించారు.

అయోధ్య రామాలయం విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భద్రాద్రి ఆలయం గురించి మాట్లాడుతూ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామజన్మభూమిలో దేశ ప్రజలందరూ స్వచ్ఛందంగా, భక్తిభావంతో ఆలయాన్ని నిర్మించుకుంటున్నారని పేర్కొన్న విజయశాంతి.. యాదాద్రిలానే భద్రాద్రిని కూడా ఈ ప్రభుత్వం గొప్పగా తీర్చిదిద్దాలని కోరారు. అప్పుడు ప్రజలు హర్షిస్తారని అన్నారు. 

కేసీఆర్‌కు అలా చేయడం ఇష్టం లేకో, ఏమో కానీ ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ఏడు మండలాలు వెనక్కి వస్తే అప్పుడు భద్రాచలం అభివృద్ధి గురించి ఆలోచిస్తామని మంత్రులతో మెలిక పెట్టిస్తున్నారని మండిపడ్డారు. తాను మాటల్లోనే హిందువునని, అయోధ్య విషయంలో ఎంఐఎంకు అసలైన బంధువునని కేసీఆర్ చెబుతారేమో చూడాలని విజయశాంతి ఎద్దేవా చేశారు.

click me!