కోడలిని తిట్టిన మామ.. కోపంతో కొడుకు ఏం చేశాడంటే...!

Published : Jun 08, 2021, 08:35 AM ISTUpdated : Jun 08, 2021, 08:37 AM IST
కోడలిని తిట్టిన మామ.. కోపంతో కొడుకు ఏం చేశాడంటే...!

సారాంశం

గత కొంతకాలంగా అతని మానసిక స్థితి సరిగాలేదు. అందుకే.. కనిపించిన ప్రతి ఒక్కరినీ దూషిస్తున్నాడు.  

అతనికి మానసిక స్థితి సరిగా లేదు. ఈ క్రమంలో.. కనిపించిన ప్రతి  ఒక్కరినీ దూషిస్తూనే ఉంటాడు. అదే అలవాటులో తన కోడలిని కూడా దూషించాడు. అయితే.. తన భార్యను తిట్టడం కొడుకు తట్టుకోలేకపోయాడు.  ఈ క్రమంలో.. ఆవేశంలో... ఏకంగా కన్న తండ్రినే హతమార్చాడు. ఈ సంఘటన కూకట్ పల్లిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కూకట్ పల్లి సఫ్దార్ నగర్ ఎండి ఇంతియాజ్(55), ఆయన ఇద్దరు కుమారులు సలావుద్దీన్, బురానుద్దీన్ ఒకే ఇంట్లో వేర్వేరుగా నివాసముంటున్నారు. ఇంతియాజ్ గతంలో ఆర్ఎంపీగా పని చేసి మానేశాడు. గత కొంతకాలంగా అతని మానసిక స్థితి సరిగాలేదు. అందుకే.. కనిపించిన ప్రతి ఒక్కరినీ దూషిస్తున్నాడు.

ఈ క్రమంలోనే కోడలిని కూడా దూషించాడు. ఆదివారం సాయంత్రం మద్యం తాగి వచ్చి తన పెద్ద కుమారుడు సలావుద్దీన్‌ భార్యతో  గొడవ పడ్డాడు. ఆమె ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. ఆవేశానికి లోనైన సలావుద్దీన్‌ గదిలో నిద్రిస్తున్న తండి తలపై సెంట్రింగ్‌ కర్రతో మోదాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి చిన్న కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.  

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?