వివాహేతర సంబంధం కారణంగా సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి హత్య చోటు చేసుకుంది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధంతో కృష్ణ అనే వ్యక్తిని ప్రశాంత్ దారుణంగా హత్య చేశారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
కృష్ణ భార్యతో ప్రశాంత్ కు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలున్నాయి.ఈ విషయమై గ్రామంలో పెద్ద మనుషుల మధ్య పంచాయితీ కూడ జరిగింది. దీంతో కృష్ణ భార్య పుట్టింటికి వెళ్లింది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని కృష్ణను ప్రశాంత్ తన స్నేహితులతో కలిసి హత్య చేశారు. ఈ హత్య చేసిన తర్వాత నిందితులు పోలీసులకు లొంగిపోయారు. ఈ హత్య విషయం తెలిసిన వెంటనే కృష్ణ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.