మరో సకలజనుల సమ్మెకు సిద్ధం కండి: ఎంపీ బండి సంజయ్

By telugu teamFirst Published Oct 13, 2019, 7:15 AM IST
Highlights

తెలంగాణాలో కెసిఆర్ రజాకార్ల పాలన సాగిస్తున్నాడని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కెసిఆర్ అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మరో సకల జనుల సమ్మె ప్రారంభించాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. 

హైదరాబాద్: తెలంగాణ లో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య ఒక మహా యుద్ధమే నడుస్తుంది.  

తెలంగాణాలో కెసిఆర్ రజాకార్ల పాలన సాగిస్తున్నాడని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కెసిఆర్ అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మరో సకల జనుల సమ్మె ప్రారంభించాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. 

కార్మికుల పక్షం బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ పోరాటం చేస్తున్నారని అన్నాడు. కార్మికుల పోరాటాన్ని అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని కెసిఆర్ పై ధ్వజమెత్తారు. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు మరో 26 డిమాండ్లపై ఆర్టీసీ జేఎసి నేతలు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. విధుల్లోకి రాకపోతే డిస్మిస్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం చెప్పినట్టుగానే దాదాపు 48వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్టు ప్రకటించింది. 

click me!