ప్రాణం తీసి పెళ్లి బారాత్.. వివాహ వేడుకలో విషాదం..

Published : Dec 11, 2020, 01:05 PM IST
ప్రాణం తీసి పెళ్లి బారాత్.. వివాహ వేడుకలో విషాదం..

సారాంశం

పెళ్లిలో బారాత్ లో డ్యాన్స్ చేసిన ఓ యువకుడు అంతలోనే హత్యకు గురవ్వడం జగిత్యాలలో కలకలం రేపింది. ఊరేగింపులో జరిగిన చిన్న వివాదం హత్యకు దారి తీసింది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. 

పెళ్లిలో బారాత్ లో డ్యాన్స్ చేసిన ఓ యువకుడు అంతలోనే హత్యకు గురవ్వడం జగిత్యాలలో కలకలం రేపింది. ఊరేగింపులో జరిగిన చిన్న వివాదం హత్యకు దారి తీసింది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. 

వివరాల్లోకి వెడితే జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం భీమరం గ్రామంలో గురువారం ఓ వర్గానికి చెందిన యువకుడి వివాహం జరిగింది. ఆ రాత్రి బారాత్ తీశారు. డి.జె సౌండ్ తో పాటలకు స్టెప్పులు వేస్తూ పెళ్లి కొడుకు స్నేహితులంతా ఎంజాయ్‌ చేస్తున్నారు. 

అంతలో మరో వర్గానికి చెందిన లక్ష్మణ్‌ అనే యువకుడు అక్కడికి చేరుకుని వారితో కలిసి స్టెప్పులేస్తుండగా, కొందరు యువకులు డి.జె ఆపేసి లక్ష్మణ్‌తో గొడవకు దిగారు. దీంతో అక్కడున్న వారంతా ఇరువురికి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

పెళ్లి ఊరేగింపు ఇంటికి చేరుకుంది. అంతలో ఓ యువకుడు మద్యం తీసుకొస్తానని చెప్పి బయటకు వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో అతన్ని వెతుక్కుంటూ రాజు అనే మరో యువకుడు వెళ్లాడు. అక్కడ లక్ష్మణ్‌తో గొడవ జరుగుతుండటం గమనించాడు. కోపంతో ఊగిపోయిన రాజు ఆవేశంగా లక్ష్మణ్‌పై కత్తితో దాడి చేశాడు. 

తీవ్రంగా గాయపడ్డ లక్ష్మణ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు రాజు అక్కడ్నుంచి పరారైనట్లుగా చెప్పారు. హుటాహుటిన గ్రామానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

RTC: ద‌స‌రా పండ‌గ‌కి ఊరుకెళ్తున్నారా.? భారీ ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ
Most Expensive Apartment: ఇండియాలో రిచెస్ట్ అపార్ట్‌మెంట్.. ఒక్కోప్లాట్ ఎన్ని కోట్లో తెలుసా?