భార్యాబిడ్డను చంపి...ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి: పరారీలో భర్త

Siva Kodati |  
Published : May 01, 2019, 07:31 AM IST
భార్యాబిడ్డను చంపి...ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి: పరారీలో భర్త

సారాంశం

హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. భార్య, కుమారుడిని హత్య చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కాడో భర్త

హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. భార్య, కుమారుడిని హత్య చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కాడో భర్త. వివరాల్లోకి వెళితే... జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కొత్తపల్లికి చెందిన గౌరవరపు రాజమ్మ, ఉప్పలయ్య దంపతులు తన కూతురు, కొడుకుతో కలిసి మన్సూరాబాద్‌లో నివాసముంటున్నారు.

వీరి ఇంటి పక్కనే నివసించే ఒడిషాకు చెందిన అయూబ్.. కవితను ప్రేమించి... నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. గత 18 నెలలుగా సయ్యద్ ఇబ్రహీం అనే వ్యక్తికి చెందిన ఇంట్లో కుమారుడు ఇర్ఫాన్, కవితతో ఉంటున్నాడు.

అయూబ్ ఆటోనగర్‌లోని ఇసుక లారీల అడ్డాలో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య శనివారం గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అయూబ్ భార్యా, బిడ్డలను హత్య చేసి మృతదేహాలను ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి పారిపోయాడు.

అయితే దుర్వాసన వస్తుండటంతో ఇంటి యజమాని అయూబ్ మంగళవారం రాత్రి వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు డ్రమ్ములో ఉన్న మృతదేహాలను బయటికి తీసి పోస్ట్‌మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్