మామూళ్లు ఇవ్వలేదని..వెంటాడి, వేటాడి దారుణ హత్య

sivanagaprasad kodati |  
Published : Nov 16, 2018, 07:42 AM IST
మామూళ్లు ఇవ్వలేదని..వెంటాడి, వేటాడి దారుణ హత్య

సారాంశం

హైదరాబాద్‌లో మైలార్‌దేవ్ పల్లిలో దారుణం జరిగింది.. మామూళ్లు ఇవ్వలేదని రౌడీ మూకలు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాయి.  మైలార్‌దేవ్ పల్లి ఏరియాలోని శాస్త్రిపురానికి చెందిన షానూ గ్యాంగ్ ఆ ప్రాంతంలోని ఓ వ్యాపారుల నుంచి మామూలు వసూలు చేస్తోంది. 

ఈ క్రమంలో గురువారం రాత్రి పేకాట ఆడుతున్న కొందరి వద్దకు వచ్చి మామూళ్ల ఇవ్వాల్సిందిగా బెదిరించింది. దీనికి వారు ఒప్పుకోకపోవడంతో మారణాయుధాలతో దాడికి దిగారు.. ఈ సమయంలో ముస్తాక్ అనే యువకుడు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా... అతనిపై కత్తులు, తల్వార్‌లతో దాడి చేసి హత్య చేశారు.

నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే హత్య జరగడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఈ తతంగాన్ని కొందరు సెల్‌ఫోన్లతో వీడియా తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ముస్తాక్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రధాని నిందితుడు షానూపై గతంలో హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది.. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu