తల్లిని చంపి జైలుకెళ్లి.. తిరిగొచ్చాక అతడు చేసిన పని... !!

Published : Mar 25, 2021, 09:53 AM IST
తల్లిని చంపి జైలుకెళ్లి.. తిరిగొచ్చాక అతడు చేసిన పని... !!

సారాంశం

ఎల్లారెడ్డి గూడ లో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. మద్యం మత్తులో కన్నతల్లిని  హత్యచేసి, ఆ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. ఆ తరువాత అప్పుల బాధ తట్టుకోలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఎస్సార్ నగర్ ఠాణా పరిధిలో జరిగింది.

 సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిగూడకు చెందిన గొంటి శ్రీనివాస్ యాదవ్, మమతల కొడుకు మదన్ యాదవ్. డిగ్రీ వరకు చదువుకున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. ఉద్యోగం లేకపోవడంతో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు.

తల్లి మమత చిట్టీల బిజినెస్ చేసేది. దీంతో కుటుంబాన్ని పోషించేది. అయితే తమ కుటుంబం అప్పులపాలవ్వడానికి  తల్లినే కారణం అంటూ 2018 జూన్ 27న మద్యం మత్తులో మమత గొంతునులిమి చంపేశాడు. ఆ తరువాత ఎస్సార్ నగర్ పోలీసులకు లొంగిపోయాడు.

ఈ కేసులో జైలు కెళ్ళిన మదన్ యాదవ్ ఇటీవల విడుదలయ్యాడు. మంగళవారం సాయంత్రం తనకు అప్పులు ఎక్కువగా ఉన్నాయని, అప్పుల వాళ్లు వేధిస్తున్నారంటూ సోదరికి చెప్పాడు. తండ్రికి చెప్పాలని ఆమె సూచించింది.

దీంతో రాత్రి బెడ్ రూం లోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన జేబులో ఒక లేఖ రాసి పెట్టాడు. దీంట్లో తాను అప్పు తీసుకున్న వారి వివరాలతో పాటు కొందరు రాజకీయ నేతల పేర్లు ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?