కరీంనగర్‌లో దారుణం, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని.. యువకుడిపై కత్తులతో దాడి

Siva Kodati |  
Published : Sep 21, 2022, 09:18 PM ISTUpdated : Sep 21, 2022, 09:19 PM IST
కరీంనగర్‌లో దారుణం, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని.. యువకుడిపై కత్తులతో దాడి

సారాంశం

తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడనే అక్కసుతో ఇద్దరు వ్యక్తులు యువకుడిపై కత్తులతో దాడికి తెగబడ్డారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో బుధవారం కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. మండల కేంద్రానికి చెందిన గడ్డం చందు అనే వ్యక్తిని, జగిత్యాలకు చెందిన గడ్డం రాజు, హైదరాబాదుకు చెందిన బుట్టి చింటూలు కత్తితో తీవ్రంగా గాయపరిచారు. గడ్డం చందు, గడ్డం నందిత అనే ఇద్దరు ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇదంతా ఇష్టంలేని గడ్డం రాజు, బుట్టి చింటూ కక్షతో చందును కత్తితో పొడిచారు. వెంటనే స్పందించిన స్థానికులు బాధితుని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

అధికార కాంగ్రెస్ బిగ్ షాక్ .. మాజీ మంత్రి రాజీనామా..? అసలు కారణమేంటో తెలుసా? | Asianet News Telugu
KTR Comments on CM Revanth Reddy: అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు| Asianet News Telugu