ఇటీవల కూడా ప్రణీత్.. రవి లేని సమయంలో జ్యోతిని కలిసేందుకు అక్కడికి వచ్చాడు. అయితే మొదటి నుంచి రవికి భార్య జ్యోతి మీద అనుమానం ఉంది. తనను కాదని వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భావించేవాడు. తన అనుమానాన్ని నిజమో కాదో తెలుసుకునేందుకు పని మీద బయటకు వెళ్లినట్లు నటించి కొద్ది దూరం వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు.
భార్య ప్రేమికుడిని చంపిన కేసులో ఓ పండ్ల వ్యాపారిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఈ సంఘటన చైతన్యపురిలో చోటుచేసుకుంది. ఈ హత్యకేసులో మృతుడి కుటుంబసభ్యులతో నిందితుడు రాజీ పడుతుండగా అతనిని పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం.
పూర్తి వివరాల్లోకి వెళితే.... చైతన్యపురికి చెందిన రవి(32) పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి జ్యోతి అనే మహిళతో వివాహమైంది. ఈ జంట చైతన్యపరిలో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. కాగా... జ్యోతి గతంలో ప్రణీత్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించింది. వీళ్లు చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. జ్యోతి భర్త రవి ఇంట్లో లేని సమయంలో ప్రణీత్.. ఆమెను కలిసేందుకు ఇంటికి వచ్చేవాడు.
undefined
ఇటీవల కూడా ప్రణీత్.. రవి లేని సమయంలో జ్యోతిని కలిసేందుకు అక్కడికి వచ్చాడు. అయితే మొదటి నుంచి రవికి భార్య జ్యోతి మీద అనుమానం ఉంది. తనను కాదని వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భావించేవాడు. తన అనుమానాన్ని నిజమో కాదో తెలుసుకునేందుకు పని మీద బయటకు వెళ్లినట్లు నటించి కొద్ది దూరం వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు.
తాను ఇంటికి వచ్చి చూసేసరికి భార్య తన ప్రియుడితో ఏకాంతంగా గడుపుతోంది. అది చూసి రవి కోపంతో ఊగిపోయాడు. జ్యోతి, ఆమె ప్రియుడు ప్రణీత్ తో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లో కూరగాలు తూచే రాళ్లు తీసుకొని ప్రణీత్ తలపై కొట్టాడు. తీవ్రగాయాలపాలై అతను అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య జ్యోతిని కూడా చంపేందుకు ప్రయత్నించగా... ఆమె స్వల్పగాయాలతో బయటపడింది.
AlsoRead పట్టాలపై కూర్చొని మందు పార్టీ.. రైలు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి...
కాగా.. ప్రణీత్ ని హత్య చేసిన అనంతరం రవి.. అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా... ఈ హత్య నవంబర్ 11వ తేదీన చోటుచేసుకోగా.. రెండు రోజుల్లోనే పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.