కొంపముంచిన బస్సు పరిచయం.. విటమిన్ మాత్రలని చెప్పి నిద్రమాత్రలు..

Published : Feb 25, 2021, 04:24 PM IST
కొంపముంచిన బస్సు పరిచయం.. విటమిన్ మాత్రలని చెప్పి నిద్రమాత్రలు..

సారాంశం

బస్సు పరిచయం ఆ మహిళ కొంపముంచింది. కష్టపడి కొనుక్కున్న బంగారాన్ని దొంగల పాలు చేసింది. బస్సులో పరిచయమైన ఓ వ్యక్తి మహిళకు విటమిన్ టాబ్లెట్స్ అని చెప్పి నిద్రమాత్రలు ఇచ్చి, ఆమె ఇంట్లోని బంగారంతో ఉడాయించాడు. 

హైదరాబాద్, సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ (36) ఎర్రగడ్డలో నివాసముంటుంది. ఈమెను గతంలో బస్సులో ఓ వ్యక్తి తో పరిచయం ఏర్పడింది. తరచుగా బస్సులో కనిపిస్తుండడంతో ఫోన్లో మాట్లాడుకునేదాకా పరిచయం పెరిగింది.

ఈ క్రమంలో ఈ నెల 22న అతను మహిళ ఇంటికి వచ్చాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్న తరువాత తన దగ్గరున్న టాబ్లెట్స్ ఆమెకు ఇచ్చాడు. అవి విటమిన్ టాబ్లెట్స్ అని వేసుకుంటే నీరసం తగ్గుతుందని చెప్పాడు. నమ్మిన మహిళ వాటిని వేసుకుంది. 

కాసేపటికే ఆమె మత్తులోకి జారుకుంది. అంతే అనుకున్న ఎత్తు పారిందనుకున్న ఆ వ్యక్తి మహిళ ఇంట్లో ఉన్న రెండు తులాల బంగారంతో ఉడాయించాడు. మెలుకువ వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

PREV
click me!

Recommended Stories

Kabaddi Match: స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరి కబడ్డీ ఆటకు రేవంత్ రెడ్డి ఫిదా | Asianet News Telugu
అసెంబ్లీలో అసభ్యకర ప్రవర్తన..పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలకు Revanth Reddy Demand | Asianet News Telugu