సిద్దిపేటలో బావిలో పడిన కారు:గజ ఈతగాడు సహా ముగ్గురు మృతి

Published : Dec 01, 2021, 09:19 PM ISTUpdated : Dec 01, 2021, 09:28 PM IST
సిద్దిపేటలో బావిలో పడిన కారు:గజ ఈతగాడు సహా ముగ్గురు మృతి

సారాంశం

సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మండలం  బావిలో పడిన కారును  వెలికి తీసేందుకు ప్రయత్నించిన గజ ఈతగాడు మరణించాడు. గజ ఈతగాళ్లు కారును బయటకు తీసేందుకు బావిలోకి వెళ్లారు.  కారులో ఉన్న వారిని రక్షించే క్రమంలో నర్సింహులు అనే వ్యక్తి మరణించాడు.

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో  బావిలో పడిన కారును వెలికితీసేందుకు ప్రయత్నించిన గజ ఈతగాడు  మరణించాడు.సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలం  చిట్టాపూర్ వద్ద  రోడ్డు పక్కన ఉన్న బావిలో కారు పడింది. ఈ విషయాన్ని గుర్తించిన  స్థానికులు  పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారును వెలికితీసేందుకు గజ ఈతగాళ్లు  బావిలోకి దిగారు. అయితే కారును వెలికి తీసేందుకు గజ ఈతగాడు బావిలోకి దిగి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని నర్సింహులుగా  గుర్తించారు. 

Dubbaka మండలం Chittapurవద్ద కారు అదుపు తప్పి బావిలో పడింది. కారు టైరు పేలడంతో అదుపు తప్పి బావిలో పడింది. కారులో ఉన్న ఇద్దరు కూడా మరణించారు. అగ్నిమాపక సిబ్బంది ద్వారా బావిలో ఉన్న నీళ్లను  మోటారు ద్వారా బయటకు తీశారు.  దీంతో Car బాగం నీటిలో తేలింది. బావిలో దిగిన గజ ఈతగాడు  Narsimhulu  కారుకు తాడు బిగించాడు.  Wellలో నుండి పైకి వచ్చే క్రమంలోనే కారుకు నర్సింహులు కూడా చిక్కుకుపోయాడు.  దీంతో నర్సింహులు కూడా మరణించాడు.  ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరితో పాటు నర్సింహులు కూడా మరణించాడు. కారులో ఇధ్దరిని తల్లీ కొడుకుగా పోలీసులు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?