మహబూబాబాద్ జిల్లాలో విషాదం: గంటల వ్యవధిలో పెళ్లి, విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

Published : May 11, 2023, 05:27 PM IST
మహబూబాబాద్ జిల్లాలో విషాదం:   గంటల వ్యవధిలో పెళ్లి, విద్యుత్ షాక్ తో  యువకుడు మృతి

సారాంశం

మహబూబాబాద్  జిల్లాలోని కొమ్ముగూడెంలో  విద్యుత్  షాక్ తో  యువకుడు   మృతి చెందారు. 

మహబూబాబాద్: జిల్లాలోని కొమ్ముగూడెంలో  విద్యుత్  షాక్ తో   యువకుడు గురువారంనాడు   మృతి చెందాడు.  రేపు  ఆ యువకుడి పెళ్లి.  పెళ్లి పీటలెక్కాల్సిన  యువకుడు  మృతి చెందడంతో   కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కొమ్ముగూడెం  గ్రామానికి  చెందిన  భూక్యా  యాకూబ్ కు  రేపు వివాహం.   దీంతో  యాకూబ్  నివాసానికి  బంధువులు  చేరుకున్నారు.  పెళ్లి పనుల్లో  అంతా బిజీగా  ఉన్నారు. అయితే  తమ నివాసంలో  బోరు  పనిచేయడం లేదు. దీంతో  యాకూబ్  బోరు రిపేర్ చేసే సమయంలో  విద్యుత్ షాక్ కు  గురై    మృతి చెందాడు. యాకూబ్ మృతితో  కుటుంబ సభ్యులు  దీంతో  షాక్ కు  గురయ్యారు.  కన్నీరు మున్నీరుగా  విలపిస్తున్నారు.   ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. 

PREV
click me!

Recommended Stories

School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు