కరోనాకి కొడుకు బలి... అది చూసి తట్టుకోలేక..!

Published : May 08, 2021, 01:08 PM IST
కరోనాకి కొడుకు బలి... అది చూసి తట్టుకోలేక..!

సారాంశం

చెట్టంత ఎదిగిన కొడుకు.. జీవితంలో స్థిరపడి తనను ప్రేమగా చూసుకుంటున్న కొడుకు చనిపోతే.. ఆ తండ్రి ఏమైపోతాడు. పాపన్న పేటలోనూ అదే జరిగింది.

అల్లారు ముద్దుగా  పెంచుకునన కొడుకు.. కళ్ల ముందే కన్నుమూయడాన్ని ఏ తండ్రైనా తట్టుకోలగలడా..? అందులోనూ చెట్టంత ఎదిగిన కొడుకు.. జీవితంలో స్థిరపడి తనను ప్రేమగా చూసుకుంటున్న కొడుకు చనిపోతే.. ఆ తండ్రి ఏమైపోతాడు. పాపన్న పేటలోనూ అదే జరిగింది.

కరోనా కాటుకు కొడుకు బలి  కావడంతో..  తట్టుకోలేక ఆ తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన పాపన్నపేట మండల పరిధిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పాపన్నపేట మండల పరిధిలోని మల్లంపేట గ్రామానికి చెందిన కొమ్మ రమేష్‌గుప్తా (39) వారం రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కుమారుడు చనిపోయిన నాటి నుంచి బెంగ పెట్టుకున్న మృతుడి తండ్రి ఈశ్వరయ్య (90) వారం రోజులు గడువకముందే గురువారం రాత్రి మరణించాడు. ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకులు మరణించడంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగారు. మృతుల కుటుంబాలకు ఎంపీపీ చందనా ప్రశాంత్‌రెడ్డి, సర్పంచ్‌ బాపురెడ్డి, పలువురు గ్రామపెద్దలు ప్రగాఢ సంతాపం తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?
Telangana Rising 2047: చైనాలోని ఆ నగరంలా తెలంగాణ.. సీఎం రేవంత్ కొత్త ఫార్ములా