ఆర్మీ సెలక్షన్స్‌లో విషాదం...కరెంట్ వైర్లు తగిలి యువకుడి దుర్మరణం

sivanagaprasad kodati |  
Published : Jan 28, 2019, 09:33 AM IST
ఆర్మీ సెలక్షన్స్‌లో విషాదం...కరెంట్ వైర్లు తగిలి యువకుడి దుర్మరణం

సారాంశం

ఆర్మీలో ఉద్యోగం సంపాదించి దేశరక్షణలో పాలుపంచుకోవాలనుకున్న ఓ యవకుడు అధికారుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయాడు. సికింద్రాబాద్ మౌలాలీలోని ఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ వద్ద టెరిటోరియల్ ఆరమీ సెలక్షన్స్ కోసం వచ్చిన ఓ యువకుడు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.

వివరాల్లోకి వెళితే... టెరిటోరియల్ ఆర్మీ సెలక్షన్స్‌లో భాగంగా సోమవారం ఉదయం సైనికాధికారులు పరుగు పందెం నిర్వహించారు. దీనిలో పాల్గొన్న వనపర్తికి చెందిన ఓ యువకుడు రోడ్డుపై పరిగెడుతుండగా అతనికి విద్యుత్ తీగలు తగిలాయి.

దీంతో సదరు యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తమతో పాటు సెలక్షన్స్‌ కోసం వచ్చిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ విషాద వాతావరణం చోటుచేసుకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే యువకుడు మరణించాడంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పు.. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ‌తో తెలంగాణ ప్ర‌భుత్వం ఒప్పందం
హైద‌రాబాద్‌లో దారుణం.. పేక‌మేడ‌లా కూలిన ఏడంతస్తుల భవనం