నా భార్య కొడుతోంది...తట్టుకోలేకపోతున్నా... పోలీసులకు భర్త మొర

Published : Jan 14, 2020, 09:55 AM IST
నా భార్య కొడుతోంది...తట్టుకోలేకపోతున్నా... పోలీసులకు భర్త మొర

సారాంశం

బషీరాబాద్ మండలం జీవన్గీకి చెందిన షాదుల్లా  సోమవారం బహీరాబాద్ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. వచ్చిన వెంటనే తన భార్య తనను కొడుతోందంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఎందుకు కొట్టింది అని పోలీసులు అడిగితే... ఏమీ లేదు సర్... సంసారం విషయంలో గొడవ అని చెప్పాడు.  

సార్... నా భార్య కొడుతోంది.. ఆ దెబ్బలను తట్టుకోలేకపోతున్నాను... ఇంటికి వెళితే మళ్లీ కొడుతుంది సార్... ప్లీజ్ మీరే కాపాడాలి అంటూ... ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్లి మొర పెట్టుకున్నాడు. ఈ సంఘటన బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బషీరాబాద్ మండలం జీవన్గీకి చెందిన షాదుల్లా  సోమవారం బహీరాబాద్ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. వచ్చిన వెంటనే తన భార్య తనను కొడుతోందంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఎందుకు కొట్టింది అని పోలీసులు అడిగితే... ఏమీ లేదు సర్... సంసారం విషయంలో గొడవ అని చెప్పాడు.

అతను కన్నీరు పెడుతుండగా... పోలీసులు సముదాయించారు. మీ భార్యను పిలిచి సర్థిచెబుతామని మాట ఇచ్చిన తర్వాత అతను అక్కడి నుంచి వెళ్లిపోవడం విశేషం. కాగా... భర్తలు కొడుతున్నారని.. పోలీసు స్టేషన్ మెట్లెక్కిన భార్యలను చూశాం కానీ... భార్య కొడుతోందని ఏడుస్తూ వచ్చిన భర్త ఇతనే అంటూ పోలీసులు పేర్కొనడం గమనార్హం.
 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు