సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

By narsimha lode  |  First Published Aug 5, 2019, 6:58 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకొనే అవకాశం ఉంది. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టినట్టుగా చెబుతున్నారు.


హైదరాబాద్: కేసీఆర్ కేబినెట్ లోకి గుత్తా సుఖేందర్ రెడ్డికి చోటు దక్కనుందనే ప్రచారం సాగుతోంది. కేబినెట్ లో చోటు కల్పించేందుకు గాను సుఖేందర్ రెడ్డికి  కేబినెట్ లో చోటు కల్పించేందుకు వీలుగానే కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

కాంగ్రెస్ పార్టీలో సుఖేందర్ రెడ్డి ఉన్న సమయంలోనే కేసీఆర్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి పదవి ఇస్తామని సుఖేందర్ రెడ్డి కేసీఆర్ టీఆర్ఎస్ లోకి సుఖేందర్ రెడ్డిని తీసుకొన్నారని చెబుతారు.సుఖేందర్ రెడ్డి ఆ సమయంలో ఎంపీగా ఉన్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని కూడ భావించారు. కానీ, ఆ తర్వాత మనసు మార్చుకొన్నారు.

Latest Videos

undefined

ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో సుఖేందర్ రెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధుల విజయంలో సుఖేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. నల్గొండలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ది వేమిరెడ్డి విజయం కోసం ఆయన తీవ్రంగానే కృషి చేశారు. కానీ, ఆయన ఓటమి పాలయ్యాడు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ సుఖేందర్ రెడ్డిని పార్టీలోకి తీసుకొన్నారు.టీఆర్ఎస్ లో చేరిన తర్వాత సుఖేందర్ రెడ్డి రైతు సమన్వయ సమితి చైర్మెన్ పదవిని కేసీఆర్ కట్టబెట్టారు. 

2018 ఫిబ్రవరి మాసంలో ఈ పదవి సుఖేందర్ రెడ్డిని వరించింది.ఎమ్మెల్సీగా సుఖేందర్ రెడ్డి శనివారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో రైతు సమన్వయ సమితి చైర్మెన్ పదవికి రాజీనామా చేశారు. 

ఈ ఏడాది మార్చి మాసంలో జరిగిన ఐదు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీగా పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగింది.కానీ, ఆ సమయంలో సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. ఎమ్మెల్సీ పదవి కోసం కొంత కాలం పాటు వేచి ఉండాలని కేసీఆర్ సుఖేందర్ రెడ్డిని కోరారు. 

ఒకే ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. సుఖేందర్ రెడ్డి గెలుపు లాంఛనమేనని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఎమ్మెల్సీగా సుఖేందర్ రెడ్డి విజయం సాధించిన వెంటనే ఆయనను కేబినెట్ లోకి తీసుకొనే అవకాశాలు లేకపోలేదని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.


 

click me!