8 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలకు గాలం: మంత్రి వర్గ విస్తరణ జాప్యం అందుకే

By pratap reddyFirst Published Jan 1, 2019, 8:00 AM IST
Highlights

ఇప్పుడు ఆ పరిస్థితిని దాటేసి, కాంగ్రెసుకు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయడానికి కేసీఆర్ పక్కా ప్లాన్ రచించినట్లు తెలుస్తోంది. కాంగ్రెసుకు చెందిన 8 మంది శాసనసభ్యులకు ఆయన గాలం వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తద్వారా కాంగ్రెసుకు ప్రతిపక్ష హోదా గల్లంతవుతుంది.

హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణను, ఎన్నికల్లో గెలిచినవారి చేత ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వాయిదా వేయడం వెనుక పక్కా ప్లాన్ ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో ఇతర పార్టీల నుంచి ఎన్నికైన నేతలను పార్టీలోకి ఆహ్వానించి ఆయన విమర్శలకు గురయ్యారు. వారిపై చర్యలు తీసుకోకపోవడంపై స్పీకర్ విమర్శల పాలయ్యారు.

ఇప్పుడు ఆ పరిస్థితిని దాటేసి, కాంగ్రెసుకు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయడానికి కేసీఆర్ పక్కా ప్లాన్ రచించినట్లు తెలుస్తోంది. కాంగ్రెసుకు చెందిన 8 మంది శాసనసభ్యులకు ఆయన గాలం వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తద్వారా కాంగ్రెసుకు ప్రతిపక్ష హోదా గల్లంతవుతుంది.

కాంగ్రెసు నుంచి 19 మంది విజయం సాధించారు. ప్రతిపక్ష హోదా కోసం కనీసం 12 మంది సభ్యులుంటే సరిపోతుంది. దీంతో 8 మంది శాసనసభ్యులను టీఆర్ఎస్ లోకి లాగి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయాలనేది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. 

కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసి, మహమూద్ అలీతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే, ఆయన మంత్రివర్గ విస్తరణకు గానీ, ప్రత్యేక శాసనసభ సమావేశాల ఏర్పాటుకు గానీ తొందరపడడం లేదు. కాంగ్రెసును పూర్తిగా దెబ్బ తీయడానికి ఆయన సమయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. 

click me!