హైదరాబాద్‌లో నడిరోడ్డు మీద యువతిపై ప్రేమోన్మాది దాడి

Siva Kodati |  
Published : Feb 06, 2019, 11:17 AM ISTUpdated : Feb 06, 2019, 12:47 PM IST
హైదరాబాద్‌లో నడిరోడ్డు మీద యువతిపై ప్రేమోన్మాది దాడి

సారాంశం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ప్రేమను అంగీకరించడం లేదనే కోపంతో ఇంటర్ విద్యార్ధిని ఓ ప్రేమోన్మాది దారుణంగా దాడి చేశాడు. బర్కత్‌పురాకు చెందిన మధులిక స్థానిక కళాశాలలో ఇంటర్ చదువుతోంది. 

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ప్రేమను అంగీకరించడం లేదనే కోపంతో ఇంటర్ విద్యార్ధిని ఓ ప్రేమోన్మాది దారుణంగా దాడి చేశాడు. బర్కత్‌పురాకు చెందిన మధులిక స్థానిక కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఈ క్రమంలో ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని భరత్ అనే యువకుడు గత కొద్దిరోజులుగా వేధిస్తున్నాడు.

దీనికి మధులిక అంగీకరించకపోవడంతో బుధవారం కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఆమెపై దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన మధులికను స్ధానికులు మలక్‌పేట యశోదా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!