వ్యాక్సిన్ లేదన్నందుకు ఏఎన్ఎం, ఆశా వర్కర్లపై యువకుడి దాడి

By Siva KodatiFirst Published May 5, 2021, 6:46 PM IST
Highlights

ఖైరతాబాత్‌లోని ఓ వెల్‌నెస్ కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వ్యాక్సిన్ పంపిణీ చేసే ఏఎన్ఎం, ఆశా వర్కర్లపై ఓ వ్యక్తి దాడి చేశాడు. తనకు వ్యాక్సిన్ చేయాలని రాజేశ్ అనే యువకుడు వారితో వాగ్వాదానికి దిగాడు. 

ఖైరతాబాత్‌లోని ఓ వెల్‌నెస్ కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వ్యాక్సిన్ పంపిణీ చేసే ఏఎన్ఎం, ఆశా వర్కర్లపై ఓ వ్యక్తి దాడి చేశాడు. తనకు వ్యాక్సిన్ చేయాలని రాజేశ్ అనే యువకుడు వారితో వాగ్వాదానికి దిగాడు.

అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ నిల్వలు లేవని ఏఎన్ఎం చెప్పడంతో రాజేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిద్దరిపై దాడికి దిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెల్‌నెస్ కేంద్రానికి చేరుకుని రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

18 నుంచి 45 ఏళ్లలోపు వయసువారికి వ్యాక్సినేషన్ వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు తెలంగాణ అధికారులు. సీఎం ఆమోదం తర్వాత దీనిని అమలు చేయనున్నారు. తెలంగాణకు కరోనా వ్యాక్సిన్  డోసులు తక్కువగా వస్తుండటంతో ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్ ఇవ్వాలనే ఆలోచనలో వుంది ప్రభుత్వం.

ముందుగా జర్నలిస్ట్‌లు, షాపింగ్ మాల్స్, హోటళ్లు వంటి జనసంచారం వుండే ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు వీకేండ్ లాక్ డౌన్ అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చెప్పారు.

Also Read:కరోనా కంట్రో‌ల్‌లోనే, భయం వద్దు: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్

ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో లాక్‌డౌన్ అవసరం లేదన్నారు. భవిష్యత్తులో కూడ వస్తోందని అనుకోవడం లేదన్నారు. బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

లాక్‌డౌన్ పై సీఎం సరైన సమయలలో నిర్ణయం తీసుకొంటారని ఆయన తెలిపారు. కరోనా విషయంలో హైకోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకొంటామన్నారు. లాక్ డౌన్ కంటే మంచి చికిత్స అందించడం ముఖ్యమన్నారు. లాక్‌డౌన్ పెట్టినా అప్పుడు పెద్ద తేడా ఉండదన్నారు. 
 

click me!