అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ కు వేధింపులు.. వ్యక్తి అరెస్ట్...

By Bukka SumabalaFirst Published Aug 15, 2022, 12:06 PM IST
Highlights

అంతర్జాతీయ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ను ఆన్ లైన్ లో స్టాకింగ్ కు పాల్పడుతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఆకతాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్ : ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ ను సోషల్ మీడియాలో ఓ వ్యక్తి వేధింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. అతడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి పేరు శ్రీకాంత్ అని.. అతడు గతంలో కూడా ఇలాంటి వేధింపులకు పాల్పడ్డాడడని తెలిసింది. అతడిని నైనా జైస్వాల్ కు ఎందుకు అలాంటి మెసేజ్ లతో ఎందుకు వేధింపులకు గురిచేశావని విచారిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో ఇటీవలికాలంలో ప్రముఖులకు ఆకతాయి నుంచి వేదింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా అంతర్జాతీయ క్రీడాకారిణి తనను వేధిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించింది. ఇంస్టాగ్రామ్ లో తనను వేధిస్తున్న పోకిరి లపై చర్యలు తీసుకోవాలని టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్  హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. ఇంస్టాగ్రామ్ లో కొందరు అభ్యంతరకరంగా మెసేజీలు చేస్తూ తనను వేధిస్తున్నారని నైనా జైస్వాల్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ కు ఆకతాయిల వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు...

నిందితుల కోసం వేట మొదలు పెట్టామని త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన నైనా జైస్వాల్.. భారత దేశానికి చెందిన టేబుల్ టెన్నిస్ స్టార్ క్రీడాకారుల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. నైనా జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్షిప్ లలో పలు టైటిళ్లను సైతం గెలుచుకుని అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణిస్తున్నారు. ఇదిలా ఉండగా 2022 ఫిబ్రవరిలో నైనా జైస్వాల్  ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయింది.  అప్పుడు కూడా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్  సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాగా, నగరానికి చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణిని వేధింపులకు గురిచేస్తున్న గుర్తుతెలియని వ్యక్తిపై హైదరాబాద్ పోలీసులు శుక్రవారం క్రిమినల్ కేసు నమోదు చేశారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ గజరావు భూపాల్ తన వాట్సాప్‌లో "ఈ యువ క్రీడాకారిణికి గుర్తు తెలియని వ్యక్తి అభ్యంతరకరమైన సందేశాలు పంపుతూ వేధిస్తున్నాడు" అని తెలిపారు. ఆమె తండ్రి గురువారం హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. అతని మీద పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌ను ఉల్లంఘించినందుకు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

click me!