నగ్నచిత్రాలు పంపాలని మహిళలకు వేధింపులు: యువకుడి అరెస్ట్

By narsimha lodeFirst Published Aug 2, 2020, 10:39 AM IST
Highlights

ఫేస్‌బుక్ ఖాతాలతో మహిళల మొబైల్ నెంబర్లను సేకరించి నగ్నచిత్రాలను పంపించాలని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న 23 ఏళ్ల ఎం. దుర్గాప్రసాద్ ను హైద్రాబాద్ పోలీసులు శనివారం నాడు అరెస్ట్ చేశారు.


హైదరాబాద్: ఫేస్‌బుక్ ఖాతాలతో మహిళల మొబైల్ నెంబర్లను సేకరించి నగ్నచిత్రాలను పంపించాలని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న 23 ఏళ్ల ఎం. దుర్గాప్రసాద్ ను హైద్రాబాద్ పోలీసులు శనివారం నాడు అరెస్ట్ చేశారు.

హైద్రాబాద్ కు చెందిన దుర్గాప్రసాద్ ఇంటర్నెట్ లో నీలి చిత్రాలు చూస్తుంటాడు. సోషల్ మీడియాలో యువతుల ఫోన్ నెంబర్లను సేకరించి వాట్సాప్ ద్వారా అసభ్యకర దృశ్యాలను పంపించేవాడు. అంతేకాదు వారికి వీడియో కాల్స్ చేసి నగ్న చిత్రాలను పంపాలని బ్లాక్ మెయిల్ చేసేవాడు. 

నగ్న చిత్రాలను పంపకపోతే  ఫోర్న్ సైట్లలో ఫోన్ నెంబర్లు పెడతామని బెదిరించేవాడు. ఇదే క్రమంలో నగరానికి చెందిన ఓ మహిళా న్యాయవాదిని కూడ వాట్సాప్ చాటింగ్ తో  వేధించాడు. దీంతో ఆమె రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయమై పోలీసులు కీలకమైన సమాచారాన్ని సేకరించారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడు దుర్గాప్రసాద్ ను శనివారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.అతనిపై గతంలో కూడ నల్గొండ, సైబ‌రాబాద్ ప‌రిధిలో ప‌లు కేసులు ఉన్నాయ‌ని, గ‌తంలో జైలుకు వెళ్లివ‌చ్చిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది.

అయినా కూడ అతని ప్రవర్తనలో మార్పులు రాలేదు. సోషల్ మీడియాలో ఫోన్ నెంబర్లను తీసుకొని యువతులపై వేధింపులకు పాల్పడుతున్నాడు. మహిళా న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
 

click me!