ఆదిలాబాద్ లో కరోనా కలకలం... హాస్పిటల్ నుండి 10మంది పాజిటివ్ పేషెంట్స్ పరార్

By Arun Kumar P  |  First Published Aug 2, 2020, 8:51 AM IST

హాస్పిటల్  సిబ్బంది నిర్లక్ష్యమో... బాధితుల లెక్కలేనితనమో తెలీదు కాదు హాస్పిటల్ లో వుండాల్సిన కరోనా పేషంట్స్ రోడ్లపైకి చేరారు. 


ఆదిలాబాద్: హాస్పిటల్  సిబ్బంది నిర్లక్ష్యమో... బాధితుల లెక్కలేనితనమో తెలీదు కాదు హాస్పిటల్ లో వుండాల్సిన కరోనా పేషంట్స్ రోడ్లపైకి చేరారు. ఆదిలాబాద్ రిమ్స్ లో చికిత్స పొందుతున్న 10మంది కరోనా రోగులు హాస్పిటల్ నుండి తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే వారు కరోనా నుండి కోలుకుని డిశ్చార్జయి ఇంటికి చేరలేదు... ఇంకా కరోనాతో బాధపడుతూనే హాస్పిటల్ నుండి తప్పించుకుని ఇంటికి చేరుకున్నారు. దీంతో పట్టణంలో కలకలం రేగింది. 

ఇలా హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకునే క్రమంలో వారు ఎవరెవరిని కలిశారో తెలీదు. ఎక్కడెక్కడ సంచరించారో తెలీదు. అసలు ఇలా పారిపోయిన వారిలో కొందరి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. వారు జనాలతో కలిసి తిరిగితే మాత్రం వీరిద్వారా మరింత మంది కరోనాబారిన పడే అవకాశాలుంటాయి. దీంతో ఆదిలాబాద్ ప్రజల్లో భయాందోళన మొదలయ్యింది. 

Latest Videos

read more   మనవళ్లకు కరోనా సోకుతుందేమోనని... తాత నాన్నమ్మ ఆత్మహత్య

రిమ్స్ నుండి పారిపోయిన కరోనా పేషెంట్స్ లో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వారు ఇద్దరుండగా, ఇంద్రవెల్లికి చెందినవారు మరో ఇద్దరు వున్నట్లు ఇప్పటివరకు గుర్తించారు. వారిని ఇప్పటికే ఫోన్ ద్వారా అధికారులు సంప్రదించినట్లు  తెలస్తోంది. ఇక మిగతా ఆరుగురు ఆచూకీ మాత్రం లభించలేదు. అధికారులు వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. 

ఇలా హాస్పిటల్ నుండి కరోనా పేషెంట్స్ పారిపోవడానికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు కరోనా పేషెంట్స్ ను పట్టించుకునేవారే లేరని... సరయిన వైద్యం అందకపోవడం వల్లే రోగులు హాస్పిటల్ నుండి ఇళ్లకు పారిపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో అయినా అప్రమత్తమై పేషెంట్స్ కి మెరుగైన వైద్యం అందించడమే కాకుండా కరోనా రోగులు పారిపోయి వైరస్ ను మరింత వ్యాప్తి చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ప్రజలు కోరుతున్నారు. 

click me!