గాంధీ భవన్‌లో దిగ్విజయ్ సింగ్ ఎదురుగానే నేతలు గల్లాలు పట్టుకున్నారు . జై కాంగ్రెస్.. సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలకు దిగారు. అనిల్ కుమార్ క్షమాపణ చెప్పాలని ఓయూ నేతలు డిమాండ్ చేశారు.
గాంధీ భవన్‌లో ఘర్షణ చోటు చేసుకుంది. ఓయూ నేతలతో అనిల్ కుమార్ వాగ్వాదానికి దిగారు. అనిల్ కుమార్ క్షమాపణ చెప్పాలని ఓయూ నేతలు డిమాండ్ చేశారు. అనిల్ కుమార్‌ను చుట్టుముట్టారు ఓయూ నేతలు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ముందే గల్లాలు పట్టుకున్నారు నేతలు. జై కాంగ్రెస్.. సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలకు దిగారు. తమకు పదవులు రాలేదని ఓయూ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్లపై అనిల్ ఎలా ఆరోపణలు చేస్తారని ఓయూ నేతలు ప్రశ్నించారు. సీనియర్ నేత మల్లు రవి ఇరు వర్గాలకు సర్ది చెప్పాలని చూసినప్పటికీ ఇరు వర్గాలు శాంతించలేదు. గాంధీ భవన్‌లో సఖ్యత కోసం దిగ్విజయ్ సింగ్ ప్రయత్నాలు చేస్తుండగా.. బయట నేతలు మాత్రం గొడవపడుతుండటం గమనార్హం.