అప్పుడు సోనియాతో ఫొటో దిగి ఇప్పుడు తిడ్తావా: కేసీఆర్ పై ఖర్గే ఫైర్

Published : Nov 30, 2018, 02:28 PM IST
అప్పుడు సోనియాతో ఫొటో దిగి ఇప్పుడు తిడ్తావా: కేసీఆర్ పై ఖర్గే ఫైర్

సారాంశం

అప్పుడు సోనియా గాంధీతో ఫొటో దిగిన కేసీఆర్ ఇప్పుడు తమను శత్రువులంటున్నారని ఖర్గే శుక్రవారం మీడియా సమావేశంలో అన్నారు.   ద్రోహం చేసినవారికి తెలంగాణ ప్రజలు అండగా ఉండరని ఆయన అన్నారు. 

హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావుపై కాంగ్రెసు సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియా గాంధీతో ఫొటో దిగి ఇప్పుడు తిడుతావా అంటూ ఆయన ప్రశ్నించారు. 

అప్పుడు సోనియా గాంధీతో ఫొటో దిగిన కేసీఆర్ ఇప్పుడు తమను శత్రువులంటున్నారని ఖర్గే శుక్రవారం మీడియా సమావేశంలో అన్నారు.   ద్రోహం చేసినవారికి తెలంగాణ ప్రజలు అండగా ఉండరని ఆయన అన్నారు. 

ప్రధాని మోడీ ప్రభుత్వానికి అనేక విషయాల్లో కేసీఆర్‌ మద్దతిచ్చారని ఆయన గుర్తు చేశారు. జీఎస్టీ, నోట్ల రద్దు, రాష్ట్రపతి ఎన్నికల్లో మోడీకి కేసీఆర్‌ మద్దతిచ్చారని ఆయన అన్నారు. నోట్ల రద్దుతో చిన్నవర్తకులు దెబ్బ తిన్నారని అన్నారు. 

దేశంలో బలహీనవర్గాలపై దాడులు పెరిగిపోయాయని ఖర్గే అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదని ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే