
తెలంగాణ రాజకీయాల్లో అతితక్కువగా వినిపించే పేరు మల్కాజ్ గిరి ఎంపి మల్లారెడ్డి ది. లోక్ సభ సభ్యుడే గాని ఆయన రాజకీయాలు మాట్లాడింది తక్కువ. తమ నాయకుడు ఒకపుడు చంద్రబాబు, ఇపుడు కెసిఆర్ ను భూజానేసుకుమోసింది కూడా బాగా తక్కువ. ఏదో ఆయనకు సీటొచ్చింది. ఎందుకిచ్చారో అందిరికి తెలుసు. ఇలాగెలిచారు. అయితే, ఇపుడాయన ఒక సంచలన వార్త అయ్యారు. ఆయన పార్లమెంటు కోసం ఒక కొత్త ప్రయోగం చేపట్టారు. బహుశా పార్లమెంటుసభ్యులెవరూ ఇలాంటి ప్రయోగం చేసి ఉండరు.
పార్లమెంటులో ఎంపిలు తెగ ప్రశ్నలు వేస్తుంటారు. నియోజకవర్గం సమస్యల మీద, జాతీయ సమస్యల మీద ఈ ప్రశ్నలుంటాయి. వీటిని ఎవరికో అయిదువేలో పది వేలో ఇచ్చి రాయిస్తు ఉంటారు. వాళ్లు సొంతంగా ప్రశ్నలేయడం అరుదు. పార్లమెంటులో ఎంపిలకు ప్రశ్నలురాసివ్వడం మంచి ఉద్యోగం. ఇలా కొన్ని ప్రశ్నలేయడంలో కొంతమంది నెంబర్ వన్ అయిన మంచిపేరు తెచ్చకుంటూ ఉంటారు. చాలా సార్లు కాంగ్రెస్ ఎంపి టి సబ్బరామిరెడ్డి నెంబర్ వన్ అయ్యారు. అయితే మల్కాజ్ గిరి ఎంపి మల్లారెడ్డి (టిడిపి తరఫున గెల్చారు. బంగారు తెలంగాణ కోసమని ఆయన టిఆర్ ఎస్ లోకి ఫిరాయించారు.)
ఈప్రశ్నలకోసం ఒక ప్రయోగం చేశారు. మీరు ప్రశ్నలివ్వడం, వాటిని నేను పార్లమెంటులో ప్రస్తావస్తానని నియోజకర్గంలోని విద్యార్థులకు ఒక ఆఫర్ ప్రకటించారు. ఇలా వచ్చిన ప్రశ్నలలోంచి ఉత్తమ ప్రశ్నలను ఎంపిక చేసి, ఆ ప్రశ్నలేసిన విద్యార్థితోపాటు తల్లితండ్రులను కూడా పార్లమెంటుకు తీసువెళతానని కూడా ప్రకటించారు. మొదట్లో నలుగరు విద్యార్థులను తీసుకువెళతానని ప్రకటించారు. ఈ ప్రయోగానికి విపరీతమయిన స్పందన రావడంతో ఆయన 37 మంది విద్యార్థులను తల్లితండ్రులతో కలిపి పార్లమెంటుకు తీసుకువెళ్తాలనని నిర్ణయించారు.
ఆయన ప్రకటనకు ఎన్ని ప్రశ్నలొచ్చాయోతెలుసా?
36 వేల మంది విద్యార్థులు స్పందించారు. 36 వేల ప్రశ్నలొచ్చాయి. ఇందులో నుంచి ‘మీ ప్రశ్న నేను అడుగుతా’ కార్యక్రమం కోసం 37 మంది విద్యార్థులు పంపిన ప్రశ్నలను ఎంపిక చేశారు.
ఎంపిక చేసిన కొన్ని ప్రశ్నలు:
ఇపుడు నడుస్తున్న శీతాకాల పార్లమెంటు సమావేశాలుముగిసేలోపు వీరందరిని పార్లమెంటుకు తీసుకువెళతానని మల్లారెడ్డి చెప్పారు. విద్యార్థులు సూచించిన ప్రశ్నల్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తానని ఆయన చెప్పారు. గత మూడున్నరేళ్లలో ఆయన లోక సభలో 332 ప్రశ్నలడిగానని చెప్పారు.