ఇప్పుడు ఐపీఎల్ అవసరమా: మహారాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Mar 8, 2020, 11:20 AM IST

మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే ఐపీఎల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ లాంటి మెగా ఈవెంట్ నిర్వహిస్తే వైరస్ వ్యాప్తి మరింత వేగంగా పెరుగుతుందని రాజేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. 


ప్రస్తుతం కరోనా ధాటికి ప్రపంచం వణుకుతున్న సంగతి తెలిసిందే. అది ఇది అని లేకుండా అన్ని రంగాలను కోవిడ్ 19 కుదిపేస్తోంది. కరోనా భయంతో ఎన్నో దేశాలు, కంపెనీలు తమ లావాదేవీలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

అటు క్రీడారంగంపైనా కోవిడ్-19 ప్రభావం పడింది.. ఎన్నో ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లు రద్దయ్యాయి. భారత్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను కరోనా భయం వెంటాడుతోంది.

Latest Videos

Also Read:భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐపీఎల్‌కు నో ప్రాబ్లమ్: లీగ్ కమిటీ

ఈ మెగాటోర్నిని ఆపేది లేదని అనుకున్న షెడ్యూల్ ప్రకారం లీగ్ ప్రారంభమవుతుందని ఐపీఎల్ కమిటీ, బీసీసీఐ స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే ఐపీఎల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ లాంటి మెగా ఈవెంట్ నిర్వహిస్తే వైరస్ వ్యాప్తి మరింత వేగంగా పెరుగుతుందని రాజేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడితే, వైరస్ ప్రభావం దారుణంగా ఉంటుందని, ఇలాంటి ఈవెంట్లు తర్వాత కూడా నిర్వహించొచ్చని రాజేశ్ ఓ మీడియా సమావేశంలో అన్నారు.

Also Read:ఐపిఎల్ పై కరోనా వైరస్ ఎఫెక్ట్: సౌరవ్ గంగూలీ వివరణ ఇదీ...

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను వాయిదా వేయాలనే అంశంపై అధికార వర్గాల్లోనూ చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 29న ముంబై ఇండియన్స్‌-చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌ జరగనుంది. 


 

click me!