ప్రేమ విఫలం... ప్రేమికుల ఆత్మహత్య

Published : May 30, 2019, 04:51 PM IST
ప్రేమ విఫలం... ప్రేమికుల ఆత్మహత్య

సారాంశం

తమ పెళ్లికి అంగీకరించలేదని ఓ ప్రేమ జంట ప్రాణాలు తీసుకున్న సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

తమ పెళ్లికి అంగీకరించలేదని ఓ ప్రేమ జంట ప్రాణాలు తీసుకున్న సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్ కు చెందిన హర్షిత అనే యువతి రమేష్ అనే యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు కొరియర్ బాయ్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరు... పెళ్లి చేసుకోవాలని భావించారు. అందుకు యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో.. ఆమె ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ విషయం తెలుసుకున్న రమేష్... హర్షిత ఇంటికి సమీపంలోని ఓ భవనం పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే