ప్రేమ జంట ఆత్మహత్య.. శవాలు కుళ్లిపోవడంతో..

Published : Nov 16, 2020, 12:57 PM IST
ప్రేమ జంట ఆత్మహత్య.. శవాలు కుళ్లిపోవడంతో..

సారాంశం

మధు గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే.. ఆ అమ్మాయి.. ఎవరూ ఏంటీ అనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు.  


తమ ప్రేమను పెద్దవాళ్లు అంగీకరించరనే బాధతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. కాగా.. వారు చనిపోయి వారం రోజులు కావడంతో.. శవాలు కుళ్లిపోయి కనిపించడం గమనార్హం. ఈ సంఘటన జగిత్యాలలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జగిత్యాలకు చెందిన మధు అనే యువకుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు 20 సంవత్సరాల క్రితమే చనిపోయారు. దీంతో.. అప్పటి నుంచి ఒంటరిగా జీవిస్తూ వస్తున్నాడు. కాగా.. మధు గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే.. ఆ అమ్మాయి.. ఎవరూ ఏంటీ అనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు.

కాగా.. అనుకోకుండా మధు.. అతను ప్రేమించిన అమ్మాయి బలవన్మరణానికి పాల్పడ్డారు. సదరు యువతి తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించరనే కారణంతో వారు చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. కాగా.. వారిద్దరూ వారం రోజుల క్రితం చనిపోయినప్పటికీ.. వారి కోసం ఎవరూ రాకపోవడం, కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Minister Sridhar Babu Comments: భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరిస్తాం | Asianet News Telugu
Hyderabad: నెల‌కు రూ. 67 ల‌క్ష‌ల అద్దె.. హైద‌రాబాద్‌లో ఫేస్‌బుక్ పెద్ద స్కెచ్