నాలుగువేల కోసం ఫైనాన్స్ కంపెనీ వేధింపులు.. ఆటో డ్రైవర్ సెల్ఫీ సూసైడ్...

By SumaBala Bukka  |  First Published Oct 20, 2022, 12:46 PM IST

అప్పులే పెనుశాపాలుగా మారి ఇద్దరి ప్రాణాలు తీసిన ఘటనలు హైదరాబాద్ లో చోటు చేసుకున్నాయి. లోన్ యాప్ వేధింపులకు కుల్సుంపురాలో ఒకరు, మలక్‌పేటలో మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. 


హైదరాబాద్ : ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు మరో ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లోన్ యాప్ లు పరువు తీస్తూ ప్రజల ప్రాణాలు తీసుకునేలా చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో ఇద్దరు ఆత్మహత్యలు చేసుకోవడం సంచలనంగా మారింది. అప్పు తీర్చే మార్గం లేక బలవన్మరణానికి పాల్పడటం విషాదాన్ని నింపింది. రుణ యాప్‌లు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. హైదరాబాద్ కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో మహ్మద్ నిజాముద్దీన్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆరు నెలల నుంచి తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. అతడు ఫైనాన్స్ కంపెనీ వేధింపులకు బలయ్యాడు. 

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక నిజాముద్దీన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజాముద్దీన్ రెండు బ్యాంకుల ఈఎంఐ ద్వారా రెండు ఫోన్లను కొన్నాడు. పెండింగ్ అమౌంట్ రూ.4వేలు చెల్లించాలంటూ ఫైనాన్స్ ఏజెంట్లు నిజాముద్దీన్ ఇంటికి వచ్చి వేధించారు. ఏజెంట్ల వేధింపులు తాళలేక బాధితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు నిజాముద్దీన్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిజాముద్దీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. 

Latest Videos

undefined

చెల్లి సాయంతో భార్యను హత్యచేసి.. ఆత్మహత్య డ్రామా.. భర్త, ఆడపడుచు అరెస్ట్...

కాగా, మలక్‌పేటలో ఇలాంటిదే మరో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మలక్ పేటకు చెందిన అబ్దుల్ నవీద్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అబ్దుల్ భారీగా అప్పులు చేశాడు. అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. కుటుంబ పోషణ  భారంగా మారింది. దీంతో.. వీటినుంచి బయటపడాలంటే తన చావు ఒక్కటే పరిష్కారమని భావించిన అబ్దుల్ జల్పల్లి చెరువులో దూకాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.

రికవరీ ఏజెంట్ల అత్యుత్సాహం.. వేధింపులు ఇలా అమాయకులను బలిగొంటోంది. వారి వేధింపులకు అప్పుల బాధతో ఒకే రోజు ఇద్దరు మృతి చెందడం నగరంలో కలకలం రేపుతోంది. అప్పే పెను ముప్పై పలువురి ప్రాణాలు తీస్తున్నాయి. తాజా ఘటనలతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
 

click me!