ప్రగతి నివేదన సభ: ప్రాంగణానికి చేరుకొంటున్న టీఆర్ఎస్ కార్యకర్తలు (వీడియో)

By narsimha lodeFirst Published Sep 2, 2018, 11:47 AM IST
Highlights

ప్రగతి నివేదన సభ ప్రాంగణం వద్దకు ఇప్పటికే  టీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలుసభకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.


హైదరాబాద్: ప్రగతి నివేదన సభ ప్రాంగణం వద్దకు ఇప్పటికే  టీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలుసభకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు  సభా ప్రాంగణానికి  కార్యకర్తలు, నేతలను చేరుకోనేలా ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేసింది.

నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో  ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రజలకు వివరించనున్నారు.  రానున్న రోజుల్లో  చేపట్టనున్న కార్యక్రమాలను గురించి కేసీఆర్ ఈ సభా వేదికపై  ప్రకటన  చేసే అవకాశం ఉంది.

ఈ సభకు ముందుగానే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో అమలు చేసే  కార్యక్రమాల గురించి కేబినెట్ లో నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదని  సమాచారం.

                          "

మరోవైపు ఈ సభకు  సుమారు 25 లక్షల మందిని సమీకరించాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. అయితే  ఈ సభా వేదికపై నుండి  విపక్షాలు సవాల్ విసరడంతో పాటు కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉందని  సమాచారం.

అయితే సుమారు 500 ఎకరాల్లో సభను ఏర్పాటు చేశారు.  ఈ సభకు వచ్చే  జనం కోసం వచ్చే వాహనాల కోసం సుమారు వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు.

సాయంత్రం నాలుగు గంటల సమయంలో సీఎం కేసీఆర్  సభ ప్రాంగంణానికి  చేరుకొంటారు. ప్రత్యేక హెలికాప్టర్ లో కేసీఆర్  సభకు చేరుకొంటారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు  ఏర్పడకుండా ఉద్దేశ్యంతోనే  ఈ నిర్ణయం తీసుకొన్నారు.

అదే విధంగా ఆయా జిల్లాల నుండి వచ్చే వాహనాలను పార్కింగ్ చేసేందుకు  పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. సుమారు 20 వేల మందితో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

 

click me!