హైదరాబాదులో కొత్త రకం గంజాయి దందా: టెక్కీ సహా ఇద్దరి అరెస్టు

By telugu teamFirst Published May 4, 2019, 2:19 PM IST
Highlights

గంజాయిని చిన్న చిన్న బాటిళ్లలో నింపి ఈ ముఠా సరఫరా చేస్తోంది. లిక్విడ్ రూపంలో దాన్ని విక్రయిస్తున్నారు. బిర్యానీ ఫుడ్ కలర్స్ బాటిళ్లలో, తేనె బాటిళ్లలో ద్రవరూపంలో ఉన్న గంజాయిని ముఠా సభ్యులు సరఫరా చేస్తున్నారు. 

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కొత్తరకం గంజాయి దందా సాగుతోంది. ఈ విషయాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. లిక్విడ్ గంజాయిని సరఫరా చేస్తున్న ముఠాను వారు పట్టుకున్నారు. ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు సహా ముగ్గురిని విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. 

గంజాయిని చిన్న చిన్న బాటిళ్లలో నింపి ఈ ముఠా సరఫరా చేస్తోంది. లిక్విడ్ రూపంలో దాన్ని విక్రయిస్తున్నారు. బిర్యానీ ఫుడ్ కలర్స్ బాటిళ్లలో, తేనె బాటిళ్లలో ద్రవరూపంలో ఉన్న గంజాయిని ముఠా సభ్యులు సరఫరా చేస్తున్నారు. 

ముఠాకు చెందిన మరో ఇద్దరు సభ్యులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.  సంగారెడ్డిలోని అమీన్ పురాలో ఈ ముఠా గుట్టు రట్టయింది. ఓ అపార్టుమెంటు నుంచి ఈ లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

click me!