ఇక్రిశాట్ లో చిరుతపులి పట్టివేత

Published : Jun 26, 2019, 11:30 AM IST
ఇక్రిశాట్ లో చిరుతపులి పట్టివేత

సారాంశం

ఇక్రిశాట్ లో  చిరుతపులిని పట్టుకున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని నెలలుగా ఇక్రిశాట్ లో చిరుతపులి సంచరిస్తోంది. 

ఇక్రిశాట్ లో  చిరుతపులిని పట్టుకున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని నెలలుగా ఇక్రిశాట్ లో చిరుతపులి సంచరిస్తోంది. తొలిసారి ఫిబ్రవరిలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరించినట్లు సమాచారం.

కాగా.. స్థానికుల సమాచారంతో చిరుత కోసం అటవీశాఖ అధికారులు మాటు వేశారు. చాకచక్యంగా దానిని పట్టుకున్నారు. మంగళవారం రాత్రి ఆ చిరుతకు మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు. అనంతరం దానిని నెహ్రూ జూ పార్క్ కి తరలించారు. దానికి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం అటవీ ప్రాంతంలో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Medaram Jatara: మేడారం వెళ్లలేక‌పోతున్నారా.? ఏం ప‌ర్లేదు ప్ర‌సాదం మీ ఇంటికే వ‌స్తుంది. ఎలాగంటే..
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు.. ఎలా ఉండనున్నాయో తెలుసా..?