బీజేపీ అధికారంలోకి వస్తే నేనే సీఎం అన్న వ్యాఖ్యలపై కోమటిరెడ్డి క్లారిటీ

By Nagaraju penumalaFirst Published Jun 26, 2019, 10:05 AM IST
Highlights

ఈ పరిణామాల నేపథ్యంలో తాను బీజేపీలో చేరి ముఖ్యమంత్రి అవుతానని ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకే తాను అలా మాట్లాడినట్లు స్పష్టం చేశారు. తన కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకే సీఎం అని మాట్లాడినట్టు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.


న్యూ ఢిల్లీ: బీజేపీలో చేరకుండానే తాను బీజేపీలో చేరి ముఖ్యమంత్రి అవుతానంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో బీజేపీలో ఒక్కసారిగా కలకలం రేపింది. 

అంతేకాదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సెటైర్లు వేశారు. బీజేపీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రమే సీనియర్ నా లేక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి లేరా అంటూ సెటైర్లు వేశారు. దీంతో బీజేపీ నేతల్లో హాట్ హాట్ గా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 

ఈ పరిణామాల నేపథ్యంలో తాను బీజేపీలో చేరి ముఖ్యమంత్రి అవుతానని ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకే తాను అలా మాట్లాడినట్లు స్పష్టం చేశారు. తన కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకే సీఎం అని మాట్లాడినట్టు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

మరోవైపు తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నయం అని చెప్పుకొచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను గద్దె దించేందుకే తాను బీజేపీలో చేరబోతున్నట్లు తెలిపారు. పీసీసీ చీఫ్‌గా ఎవరిని తీసుకున్నా తెలంగాణలో కాంగ్రెస్‌ బతికే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. 

బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తనను బీజేపీలోకి రావాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కోరారని ఈ విషయంపై ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ తో చర్చలు జరిపినట్లు తెలిపారు. 

మరికొద్దిరోజుల్లో బీజేపీలో చేరతానని స్పష్టం చేశారు. బీజేపీ అధిష్టానం నిర్ణయం ప్రకారమే నడుచుకుంటానని తెలిపారు. అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. రాబోయే జమిలి ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 

click me!