భగవద్గీత ఉర్దూ అనువాద కర్త హసనుద్దీన్ కన్నుమూత

By telugu teamFirst Published Aug 14, 2019, 11:36 AM IST
Highlights

హసనుద్దీన్... ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. ఆయన నిజాం కుటుంబానికి చెందినవాడు కావడం గమనార్హం. హసనుద్దీన్ తండ్రి నిజాం రాజుగా పరిపాలించారు.  నిజాం పాలనలో హసనుద్దీన్ 1945లో మతపర విభాగానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.

భగవద్గీతను ఉర్దూ అనువాదకర్త డాక్టర్ హసనుద్దీన్ అహ్మద్(97) మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత మూడు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన .. మంగళవారం తుది శ్వాస విడిచారు. హసనుద్దీన్ కి ఇద్దరు కుమారులు షంసుద్దీన్ అహ్మద్, జహరుద్దీన్.

ఆయన మృతి తో కుటుంబసభ్యులు విషాదంలో కూరుకుపోయారు. ఈ ఘటన జరిగిన నాలుగు గంటలకే మరో విషాదకర సంఘటన వారి కుటుంబంలో చోటుచేసుకుంది. హసనుద్దీన్ అహ్మద్ కజిన్ మేజర్ అహ్మద్ అబ్దుల్ అజిజ్ కూడా మృతి చెందారు. హసనుద్దీన్ కన్నుమూసిన నాలుగు గంటల్లోనే ఈయన కూడా తుదిశ్వాస విడవడం గమనార్హం.

మంగళవారం సాయంత్రం ఇరువురి అంత్యక్రియలను వారి కుమారులు నిర్వహించారు. ఇద్దరి మృతితో వారి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

హసనుద్దీన్... ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. ఆయన నిజాం కుటుంబానికి చెందినవాడు కావడం గమనార్హం. హసనుద్దీన్ తండ్రి నిజాం రాజుగా పరిపాలించారు.  నిజాం పాలనలో హసనుద్దీన్ 1945లో మతపర విభాగానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఐఏఎస్ గా విధులు చేపట్టకముందే ఆయన చాలా రకాల విధులు నిర్వహించారు. ప్రజల కోసం పలు విధాలుగా సేవలు అందించారు. 

ఐఏఎస్ గా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఆయన ప్రజలకు పలు సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా కూడా ఆయన పనిచేశారు. ఐఏఎస్ అధికారి హోదాలో ఉండి.. లండన్ లోని ఇండియన్ హౌస్ లో నిర్వహించిన తొలి  భారత స్వతంత్ర్య వేడుకలకు భార్యతో సహా హాజరైన తొలి వ్యక్తి ఈయనే కావడం విశేషం. 

ఇంగ్లీష్, ఉర్దూ ఈ రెండు భాషల్లోనూ ఈయనకు నైపుణ్యం ఎక్కువ. భగవద్గీతను ఆయన ఉర్దూ భాషలోకి అనువధించగా... ఆ పుస్తకాన్ని మహాత్మాగాంధీ విడుదల చేయడం విశేషం. 

click me!