అలిగిన దత్తాత్రేయ.. మెట్రో రైలు దిగేసి...

By ramya neerukondaFirst Published Sep 24, 2018, 2:57 PM IST
Highlights

ట్రైన్ ఎంజీబీఎస్‌ స్టేషన్‌కు రాగానే దత్తాత్రేయ మధ్యలో దిగిసి వెళ్లిపోయారు. అనంతరం గవర్నర్, మంత్రులు ఎంజీబీఎస్ ఇంటర్ ఛేంజ్ స్టేషన్‌ను పరిశీలించారు.

కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ దత్తాత్రేయ అలకబూనారు. వెంటనే మెట్రోలో నుంచి మధ్యలోనే కిందకు దిగి వెళ్లిపోయారు. ఇంతకీ మ్యాటరేంటంటే... మీర్‌పేట-ఎల్బీనగర్ మెట్రో రైలు ప్రారంభోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. గవర్నర్ నరసింహన్, మంత్రులు నాయిని, కేటీఆర్, తలసాని, కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ దత్తాత్రేయ ప్రారంభించారు.  

అనంతరం అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ ట్రైనులో వెళ్తుండగా దత్తాత్రేయ అలకబూనారు. మెట్రో రైలుపై ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రైన్ ఎంజీబీఎస్‌ స్టేషన్‌కు రాగానే దత్తాత్రేయ మధ్యలో దిగిసి వెళ్లిపోయారు. అనంతరం గవర్నర్, మంత్రులు ఎంజీబీఎస్ ఇంటర్ ఛేంజ్ స్టేషన్‌ను పరిశీలించారు.
 
ఈ ఉదయం అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో రైలు మార్గం ప్రారంభమైంది. అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ వరకు 17 మెట్రోస్టేషన్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రయాణికులకు అనుమతి ఉంటుందని మెట్రో రైలు అధికారలు తెలిపారు.

click me!