హైద్రాబాద్‌లో భారీ వర్షం: వరద నీటిలో చిక్కుకొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారు

Published : Jul 15, 2021, 11:33 AM IST
హైద్రాబాద్‌లో భారీ వర్షం: వరద నీటిలో చిక్కుకొన్న ఎమ్మెల్యే  సుధీర్ రెడ్డి కారు

సారాంశం

 హైద్రాబాద్ లో భారీ వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. నీట మునిగిన కాలనీలను సందర్శించేందుకు వెళ్లిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారు కూడ వరద నీటిలో చిక్కుకుపోయింది. కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో  కురిసిన భారీ వర్షాలకు వరద నీటిలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారు చిక్కుకుపోయింది. కారును  వరద నీటి నుండి బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నించారు. ఎమ్మెల్యే కూడ కారు దిగి కారును  తోశాడు. కానీ వరద నీటి నుండి కారు బయటకు రాలేదు.

బుధవారం నాడు సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు నగరంలో భారీ వర్షం కురిసింది. వర్షంతో  నగరంలో  పలు కాలనీలు నీట మునిగాయి. నీట మునిగిన కాలనీల్లో   ప్రాంతాల్లో ఎల్బీనగర్  ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి  సాగర్  రింగ్ రోడ్డులోని హస్తినాపురం ప్రాంతంలో   ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటిస్తున్నాడు. సుధీర్ రెడ్డి కారు వరద నీటిలో మునిగిపోయింది.దీంతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారు దిగి వరద నీటిలోనే కారును బయటకు తీసేందుకు స్థానికులతో కలిసి ప్రయత్నించాడు. 

బంగాళఖాతంలో అల్పపీడనం  కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో  భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం నాడు సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు వర్షాలు కురిశాయి. హైద్రాబాద్ లో  బుధవారం నాడు రికార్డుస్థాయిలో  వర్షపాతం నమోదైంది. ఈ వర్షం కారణంగా  లోతట్టు  ప్రాంతాలు నీట మునిగాయి. 
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ