చంద్రబాబు వచ్చాక ఉమా మహేశ్వరి లేఖ మాయం: లక్ష్మీపార్వతి సంచలనం

Published : Aug 03, 2022, 07:39 PM ISTUpdated : Aug 03, 2022, 08:33 PM IST
చంద్రబాబు వచ్చాక ఉమా మహేశ్వరి లేఖ మాయం: లక్ష్మీపార్వతి సంచలనం

సారాంశం

ఎన్టీఆర్ చిన్నకూతురు ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు ముందు లేఖ రాసిందని లక్ష్మీపార్వతి చెప్పారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ లేఖ మాయమైందని ఆమె ఆరోపించారు.ఇవాళ ఉమా మహేశ్వరి అంత్యక్రియలు నిర్వహించారు.

హైదరాబాద్: ఎన్టీఆర్ చిన్న కూతురు Uma Maheshwari  ఆత్మహత్యకు ముందు  లేఖ రాసిందని  Laxmi Parvathi  చెప్పారు. బుధవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు Chandrababu naidu వెళ్లాక ఆ లేఖ మాయమైందని ఆమె ఆరోపించారు. చంద్రబాబు నాయుడు NTR  కుటుంబానికి శనిలాంటోడని ఆమె వ్యాఖ్యానించారు. ఉమా మహేశ్వరి మృతి మిస్టరీగా మారిందని ఆమె  అభిప్రాయపడ్డారు.

ఉమా మహేశ్వరి మృతి వెనుక ఏదో జరిగిందనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఈ నెల 1వ  తేదీన ఉమామహేశ్వరి హైద్రాబాద్ లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొంది.ఇవాళ మధ్యాహ్నం ఉమా మహేశ్వరి అంత్యక్రియలు జరిగాయి. ఉమా మహేశ్వరి ఆత్మహత్య  చేసుకున్న సమయంలో ఇంట్లో కూతుెరు, అల్లుడు కూడా ఉన్నారు. కూతురు దీక్షిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీక్షిత ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరో వైపు ఉమా మహేశ్వరి ఆత్మహత్య విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగు యువత నేతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమా మహేశ్వరి ఆత్మహత్య విసయంలో  వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 

ఉమా మహేశ్వరి కొంత కాలంగా డిఫ్రెషన్ తో ఉన్నారని ఈ విషయమై ఆమె చికిత్స తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఆమె తన గదిలోనే గంటల తరబడి నిద్రపోతారని కుటుంబ సభ్యులు గుర్తు చేస్తున్నారు.. ఈ నెల 1వ తేదీన ఆమె తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. పడుకొందని తాము భావించినట్టుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దీక్షిత చెప్పారు. అయితే మధ్యాహ్నం భోజనం సమయంలో ఆమె తలుపు కొట్టిన సమయంలో తలుపు తీయలేదన్నారు.  
 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu