బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు బుధవారం నాడు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలుసుకున్నారు. తమ సమస్యలను విద్యార్ధులు రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చారు.
హైదరాబాద్: Basara IIIT విద్యార్ధులు బుధవారం నాడు Telangana Governor తమిళిసై సౌందర రాజన్ ను కలుసుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు గత నెలలో నిర్వహించిన ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు తమ సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్ పై గవర్నర్ Tamilisai Soundararajan ఆవేదన వ్యక్తం చేశారు.పుడ్ పాయిజన్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని గవర్నర్ చెప్పారు. తాను మీకు ఎంత సపోర్ట్ చేయగలనో అంత మేరకు సపోర్ట్ చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. తాను త్వరలోనే 75 కాలేజీలను సందర్శిస్తానని గవర్నర్ ప్రకటించారు. బాసర ట్రిపుల్ ఐటీని కూడా సందర్శిస్తానన్నారు.
undefined
ఇవాళ రాష్ట్రంలోని పలు యూనివర్శిటీలకు చెందిన విద్యార్ధులు గవర్నర్ తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు కూడా ఉన్నారు. ప్రతి యూనివర్శిటీ నుండి వచ్చిన విద్యార్ధులు తమ సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చారు. పలు యూనివర్శిటీల్లో చోటు చేసుకున్న సమస్యలను పరిష్కరించనున్నట్టుగా గవర్నర్ తెలిపారు.
also read:బాసర ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం: ఆరుగురికి కోవిడ్, ఐసోలేషన్ లో చికిత్స
ఈ ఏడాది జూలై 30 వ తేదీ రాత్రి నుండి జూలై 31వ తేదీ రాత్రి వరకు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు భోజనం మానేసి నిరసనకు కూడా దిగారు. మెస్ కాంట్రాక్టర్ ను మార్చివేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్ధులు ఆందోళనకు దిగారు.ఈ నెల 16వ తేదీన బాసర ట్రిపుట్ ఐటీలో పుడ్ పాయిజన్ అయింది.ఈ ఘటనలో ఒక విద్యార్ధి మృతి చెందారు. మరో విద్యార్ధి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది..
దీంతో మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలని విద్యార్ధులు ఆందోళనకు దిగారు. విద్యార్ధులకు మద్దతుగా వారి తల్లిదండ్రులు కూడా గత నెల 31న హైద్రాబాద్ లో సమావేశమయ్యారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు బాసర ట్రిపుట్ ఐటీ విద్యార్ధుల పేరేంట్స్ ఆందోళన నిర్వహించారు.ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గత నెల 31న రాత్రి విద్యార్ధులతో నిర్వహించిన చర్చలు ఫలవంతమయ్యాయి. దీంతో విద్యార్ధులు ఈ నెల 1వ తేదీ నుండి విద్యార్ధులు క్లాసులకు హాజరౌతున్నారు.
తమ 12 డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈ ఏడాది జూన్ 20వ తేదీ వరకు వారం రోజుల పాటు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు ఆందోళన నిర్వహించారు. జూన్ 20వ తేదీన రాస్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చలతో విద్యార్ధులు తమ ఆందోళనను విరమించారు.ఈ ఆందోళన విరమించిన తర్వాత విద్యార్ధులు క్లాసులకు హాజరయ్యారు. అయితే విద్యార్ధులను డిమాండ్లను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని ఇంచార్జీ వీసీ వెంకటరమణ చెప్పారు.
విద్యార్ధుల డిమాండ్ల విషయంలో తాము కూడా సానుకూలంగా ఉన్నామని వీసీ చెబుతున్నారు. విద్యార్ధులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామని వీసీ తెలిపారు. అయితే చదువుకొనే విద్యార్ధులను అడ్డుకొంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. అయినా పద్దతి మారకపోతే భర్తరఫ్ తప్పదని హెచ్చరించారు.