
హైదరాబాద్ చిక్కడపల్లిలో శుక్రవారం కాల్పుల కలకలం రేగింది. శివారెడ్డి అనే న్యాయవాది గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇయన స్వగ్రామం కడపగా తెలుస్తోంది. తన లైసెన్స్ రివాల్వర్‌తో శివారెడ్డి కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు తెలియాల్సి వుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు.