ఐమాక్స్ లోని ఓ స్క్రీన్ లో సినిమా ప్రదర్శిస్తుండగా భరించలేని దుర్వాసన వచ్చింది. దీంతో ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. పోలీసులు చేరుకొని సమస్య పరిష్కరించారు.
హైదరాబాద్ లోని ఐమాక్స్ లో శుక్రవారం అర్ధరాత్రి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ ప్రేక్షకులు థియేటర్ సిబ్బందితో ఆందోళనకు దిగారు. చివరికి పోలీసులు అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరించారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే ?
గగన్ యాన్ లో సాంకేతిక లోపం.. చివరి క్షణంలో ఆగిన ప్రయోగం..
ఐమాక్స్ లోని ఓ స్క్రీన్ లో ‘గణపత్’ సినిమా ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం రాత్రి 11.15 గంటల చివరి షో వేశారు. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు టిక్కెట్లు తీసుకొని లోపలికి ప్రవేశించారు. సినిమా మొదలైన కొంత సమయం తరువాత థియేటర్ లోకి ఆకస్మాత్తుగా భరించలేని దుర్వాసన రావడం మొదలైంది. దీంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దుర్వాసన రాకుండా స్ప్రే చేస్తామని ప్రేక్షకులకు చెప్పారు.
వార్నీ.. భర్తను రూ.5 లక్షలకు అమ్మేసింది, ఒప్పందపత్రం కూడా రాసుకుంది.. ఎక్కడంటే...
కానీ దుర్వాసన తగ్గలేదు. అరగంట దాటినప్పటికీ అలాగే కొనసాగింది. దీంతో ప్రేక్షకులకు కోపం ఎక్కువయ్యింది. కోపంతో అందరూ ఒక్కసారిగా బయటకు వచ్చేశారు. టికెట్ కు చెల్లించిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ థియేటర్ సిబ్బందితో ఆందోళనకు దిగారు. ఈ విషయం పోలీసుల వరకు చేరింది. వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రేక్షకులతో, థియేటర్ యాజమాన్యంతో మాట్లాడారు. దీంతో టిక్కెట్టు డబ్బులు ఇచ్చేందుకు యాజమాన్యం ఒప్పుకుంది. దీంతో సమస్య పరిష్కారం అయ్యింది.