చంపాపేట్ లో కేసిఆర్ దిష్టిబొమ్మ దగ్థం (వీడియో)

First Published Dec 16, 2017, 2:05 PM IST
Highlights
  • లంబాడీలపై దాడులు అరికట్టాలి
  • తక్షణమే నిందితులను శిక్షించాలి
  • దిల్ షుఖ్ నగర్ లో లంబాడీ సేవాలాల్ సేన ర్యాలీ
  • వరంగల్ నగరంలోనూ ఉద్రిక్తత.. 
  • లంబాడీ యూత్ ర్యాలీ.. అరెస్టు

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో లంబాడీల పై జరిగిన దాడిని లంబాడీ సేవాలాల్ సేన నేతలు తీవ్రంగా ఖండించారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, దాడికి గురైన వారికి న్యాయం చేయాలంటూ హైదరాబాద్ లో ర్యాలీ జరిపారు.

కేసిఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ మూసారాంబాగ్ నుండి దిల్ షుక్ నగర్ రాజీవ్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ  చేపట్టారు.

అనంతరం చంపాపేట్ చౌరస్తా లో ​కేసీఆర్​ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.

లంబాడీ సేవాలాల్ సేన నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టడంతో దిల్ షుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

లంబాడీ సేవాలాల్ సేన ర్యాలీ వీడియో కింద చూడొచ్చు.

 

వరంగల్ లో ఉద్రికత్త... అరెస్టులు

ఇదిలా ఉంటే వరంగల్ నగరంలోనూ లంబాడీలు ఆందోళన చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో లంబాడీలపై దాడుల నేపథ్యంలో వరంగల్ లో భారీ ర్యాలీ జరిపారు. పెద్ద సంఖ్యలో లంబాడీ యువకులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. వారి ఆందోళన తీవ్రమైతున్న తరుణంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి అరెస్టు చేశారు. వారి ఆందోళనతో నగరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళన వీడియో కింద చూడొచ్చు. లంబాడీ ప్రజలపై తెలంగాణలో రోజు రోజుకూ దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాడుల నుంచి రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. లంబాడీ నేతల అరెస్టు సందర్భంలో పోలీసులకు, లంబాడీ నేతలకు మధ్య మాటకు మాట, తోపులాట జరిగింది. నాయకులు కార్యకర్తలను అరెస్టు చేసి నగరంలోని వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. వరంగల్ లో ఆందోళన వీడియో కింద చూడొచ్చు.
 

click me!