ఎన్నికల ఎఫెక్ట్..15రోజుల్లో మూడు పార్టీలు మారాడు

Published : Nov 16, 2018, 12:35 PM IST
ఎన్నికల ఎఫెక్ట్..15రోజుల్లో మూడు పార్టీలు మారాడు

సారాంశం

ఎన్నికలు దగ్గరపడ్డాయి అనగానే.. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేసే  నేతలు అన్ని పార్టీల్లోనూ ఉంటారు. 

ఎన్నికలు దగ్గరపడ్డాయి అనగానే.. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేసే  నేతలు అన్ని పార్టీల్లోనూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న పార్టీ తమకు అనుకూలంగా ఉంది అనుకుంటే.. ఒకే. లేదు.. పార్టీ టికెట్ ఇవ్వదు.. అనే డౌట్ వచ్చింది అంటే చాలు.. వెంటనే తమ అనుకూల పార్టీ చూసుకొని జంప్ అయిపోతారు.

అయితే.. ఓ వ్యక్తి మాత్రం కేవలం 15 రోజుల్లో మూడు పార్టీలు మారాడు. ఆయనే లాలూనాయక్. పదిహేను రోజుల్లో రెండు కండువాలు మార్చేశారు. మూడు పార్టీలు మారారు. లాలునాయక్‌ 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి దేవరకొండ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి టికెట్‌ రాకపోవడంతో అక్టోబర్‌ 29న జానారెడ్డి, కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 

మళ్లీ ఏమనుకున్నారో ఏమో.. కాంగ్రెస్ లో పరిస్థితి కూడా ఆయనకు నచ్చలేదు. అంతే వెంటనే ముఖ్యనాయకుల సమక్షంలో బీజేపీలో కి దూకేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు
హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?