మొదలైన సంక్రాంతి సందడి... ఆన్‌లైన్‌లో పందెం కోళ్లు

By sivanagaprasad kodatiFirst Published Nov 16, 2018, 12:35 PM IST
Highlights

సంక్రాంతికి రెండు నెలల ముందుగానే తెలుగు పల్లెల్లో పండగ సందడి మొదలైంది.  సంక్రాంతి అంటే ముందుగా గుర్తుచ్చే పందెం కోళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. దీనిని క్యాష్ చేసుకునేందుకు వీటి నిర్వాహకులు ఆన్‌లైన్ బాట పట్టారు. 

తమ వద్ద ఉన్న కోళ్ల ఫోటోలు, ధరలను పెంపకందారులు ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచారు. పందెంరాయుళ్లు ఒక్కో పుంజును రంగును బట్టి రూ.30 వేల నుంచి రూ.50 వేలకు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు.

కోళ్ల పందాలకు ప్రసిద్ధి చెందిన ఉభయ గోదావరి జల్లాల్లోని జంగారెడ్డిగూడెం, గుర్వాయగూడెం, నాగుల గూడెం, పేరంపేట, పంగిడిగూడెం, బాటగంగానమ్మగుడి, శ్రీనివాసపురం, మైనస్నగూడెం, లక్కవరం, దేవులపల్లి, వెంకటాపురం ప్రాంతాల్లో ఆయిల్‌పామ్ తోటల్లో పుంజులను పెంచుతున్నారు.

పోలీసుల కంటపడకుండా చుట్టూ కంచెను ఏర్పాటు చేసి బయటికి తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. ఈ విధానం రెండేళ్ల నుంచి అమలు చేస్తున్నామని... దీనికి స్పందన బాగుందని వ్యాపారులు చెబుతున్నారు. 
 
click me!