తెలంగాణ అసెంబ్లీ ఫలితాలపై లగడపాటి సంచలన వ్యాఖ్యలు

By Nagaraju TFirst Published Jan 30, 2019, 4:36 PM IST
Highlights

ప్రతిపక్ష పార్టీ అనూహ్యంగా ఫలితాలు సాధించిందని చెప్పుకొచ్చారు. పంచాయితీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై అనుమానాలు నిజమయ్యేలా ఉన్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన అధికార పార్టీ నెలరోజుల్లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కాస్త వ్యతిరేక తీర్పు రావడం ఏంటని నిలదీశారు. 

ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు పంచాయితీ ఎన్నికల ఫలితాలకు చాలా వ్యత్యాసం ఉందని మాజీఎంపీ ఆంధ్రా ఆక్టోపస్ గా పేర్గాంచిన లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన టీఆర్ఎస్ పార్టీ పంచాయితీ ఎన్నిల్లో ఫలితాలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. 

ప్రతిపక్ష పార్టీ అనూహ్యంగా ఫలితాలు సాధించిందని చెప్పుకొచ్చారు. పంచాయితీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై అనుమానాలు నిజమయ్యేలా ఉన్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన అధికార పార్టీ నెలరోజుల్లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కాస్త వ్యతిరేక తీర్పు రావడం ఏంటని నిలదీశారు. 

పంచాయితీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ బలపరచిన అభ్యర్థులు విజయం సాధించారని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నెలకొన్న ఫలితాలపై ఈసీ నివృత్తి చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు లగడపాటి రాజగోపాల్.   
 
ఈ వార్తలు కూడా చదవండి

లోకసభ ఎన్నికల తర్వాత వాస్తవాలు చెప్తా: తెలంగాణ సర్వేపై లగడపాటి

click me!