లోకసభ ఎన్నికల తర్వాత వాస్తవాలు చెప్తా: తెలంగాణ సర్వేపై లగడపాటి

By Nagaraju TFirst Published Jan 30, 2019, 4:26 PM IST
Highlights

అనంతరం ఆయన మీడియాకు దూరంగా ఉండిపోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడిన ఆయన సర్వేపై పూర్తి స్థాయి సర్వే చేయించానని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ధన ప్రవాహం విపరీతంగా జరుగుతుందని తాను చెప్పానని అలాగే జరిగిందన్నారు. 
 
ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి తాను ఆశ్చర్యపోయానని ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవుతుందని ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని చెప్పిన విషయం తెలిసిందే.  

అనంతరం ఆయన మీడియాకు దూరంగా ఉండిపోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడిన ఆయన సర్వేపై పూర్తి స్థాయి సర్వే చేయించానని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ధన ప్రవాహం విపరీతంగా జరుగుతుందని తాను చెప్పానని అలాగే జరిగిందన్నారు. 

ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై అనేక సందేహాలను వ్యక్తం చేశారు. పోలీంగ్ పూర్తైన తర్వాత ఎందుకు పోలీంగ్ శాతం చెప్పలేదని ప్రశ్నించారు. పోలింగ్ పూర్తైన రోజున్నర తర్వాత ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 

కొన్ని నియోజకవర్గాల్లో వీవీ ప్యాడ్ ఓట్లు ఈవీఎంల కంటే ఎక్కువగా వచ్చాయని తెలిపారు. ఫలితాలు విడుదలైన తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. వాటిని నివృత్తి చెయ్యాల్సిన బాధ్యత ఈసీదేనని తెలిపారు. 

తాను ఎవరి ప్రోద్భలంతోనో ఫలితాలు విడుదల చెయ్యలేదని చెప్పుకొచ్చారు. వాస్తవం ఏంటనేది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రకటిస్తానని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. 
 
click me!