చాలా మిస్ అవుతున్నారా..: కొడుకును తలచుకుని కేటీఆర్ ఎమోషనల్

By Arun Kumar P  |  First Published Oct 11, 2023, 9:22 AM IST

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కొడుకు హిమాన్షును తలచుకుని మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికన ఎమోషనల్ ట్వీట్ చేసారు.


హైదరాబాద్ : ఆయనో రాజకీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్... వివిధ శాఖలకు మంత్రి కూడా. దీంతో రాజకీయాలు, మంత్రిత్వ శాఖ పనులతోనే ఆయనకు సరిపోతుంది... ఇంకా కుటుంబానికి సమయం ఎక్కడుంటుంది అనుకుంటాం. కానీ కేటీఆర్ అలా కాదు... పాలిటిక్స్ పాలిటిక్సే, కుటుంబం కుటుంబమే అని నిరూపిస్తున్నారు. రాజకీయాల్లో ఎంత బిజీగా వున్నప్పటికీ భార్యా పిల్లలతో గడిపేందుకు ఇష్టపడుతుంటారాయన. అలాంటిది ఇంతకాలం తన చేయిపట్టుకుని నడిచిన కొడుకు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు. దీంతో కొడుకుని గుర్తుచేసుకుని మంత్రి కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు. 

కొడుకు హిమాన్షుతో కలిసున్న ఫోటోను ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేసారు కేటీఆర్. దూరంగా వుంటున్న కొడుకును ఎంతలా మిస్ అవుతున్నారో ఈ  ట్వీట్ ద్వారా తెలియజేసి కేటీఆర్ తండ్రి మనసును చాటుకున్నారు. ఇలా హిమాన్షు కోసం కేటీఆర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారుతోంది. కేటీఆర్ అభిమానులు, బిఆర్ఎస్ నాయకులే కాదు సామాన్య నెటిజన్లు సైతం ఈ ట్వీట్ పై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 

Latest Videos

హైదరాబాద్ లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషన్  స్కూల్లో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్న కేటీఆర్ తనయుడు హిమాన్షు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. స్వయంగా కేటీఆరే కుటుంబసమేతంగా అమెరికా వెళ్లి కొడుకు చదువు, వసతికి సంబంధించిన ఏర్పాట్లు చేసారు. ఇందుకోసం కేటీఆర్ కుటుంబం వారంరోజుల  పాటు అమెరికాలోనే వుంది. 

Missing this kid ❤️ pic.twitter.com/3I8uwdjlxW

— KTR (@KTRBRS)

 

హిమాన్షును అమెరికాకు పంపేముందు కూడా ఇలాగే కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు. ''మొన్నటివరకు అల్లరి చేస్తూ తిరిగిన పిల్లాడు అప్పుడే పెద్దవాడై కాలేజికి వెళ్ళేందుకు సిద్దమయ్యాడు. ఇది నేనింకా నమ్మలేకపోతున్నా. హిమాన్షు ఒక్కడే అమెరికా వెళ్లడంలేదు...  నాలోని సగభాగాన్ని తీసుకెళుతున్నాడు'' అంటూ  మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసారు. 

హిమాన్షు కూడా ఇటీవల తన తాతయ్య కేసీఆర్ ను మిస్ అవుతున్నట్లు ట్వీట్ చేసారు. తాను ఫ్యామిలీని మిస్ అవుతున్నట్టుగా పేర్కొంటూ కుటుంబంతో ఉన్న చిత్రాలను షేర్ చేసాడు. ‘‘నేను వారిని ప్రతిరోజూ మిస్ అవుతున్నాను. ముఖ్యంగా తాతయ్యను మిస్ అవుతున్నాను’’ అంటూ హిమాన్షు ఎమోషనల్ అయ్యాడు. 

click me!