Ukraine Russia Crisis చార్జీలు భరిస్తాం: ఉక్రెయిన్ నుండి తెలంగాణ విద్యార్ధుల తరలింపుపై కేటీఆర్

Published : Feb 25, 2022, 01:58 PM IST
Ukraine Russia Crisis చార్జీలు భరిస్తాం: ఉక్రెయిన్ నుండి తెలంగాణ విద్యార్ధుల తరలింపుపై కేటీఆర్

సారాంశం

ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్ధులను స్వంత రాష్ట్రానికి రప్పించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని కేటీఆర్ కేంద్రాన్ని కోరారు.

హైదరాబాద్:Ukraineలో చిక్కుకున్న Telangana విద్యార్ధులను రప్పించేందుకు ప్రత్యేక Flight ఏర్పాటు చేయాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR  కేంద్రాన్ని కోరారు. ప్రత్యేక విమానం కోసం అవసరమైన ఖర్చులను కూడా తాము భరిస్తామని తెలంగాణ మంత్రి  కేటీఆర్ చెప్పారు.

 ఉక్రెయిన్ లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వందలాది మంది భారత్ నుండి వెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున విద్యార్ధులు MBBS విద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్ వెళ్తారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపు కోసం ఇండియా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చర్యలు ప్రారంభించారు. రష్యా విదేశాంగ మంత్రితో  గురువారం నాడు జైశంకర్ మాట్లాడారు.

ఉక్రెయిన్ పరిణామాలపై రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ తో మాట్లాడానని దౌత్యమే  ఉత్తమ మార్గమమని తాను చెప్పానని Jaishankar ట్వీట్ చేశారు.

ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు గాను రొమేనియా, హంగేరీ, స్లోవేకియా, పోలాండ్ సరిహద్దుల ద్వారా ఉక్రెయిన్ లో చిక్కుకొన్న వారిని భారత్ కు రప్పించేందుకు విదేశాంగ పర్యత్నాలను ప్రారంభించింది. ఉక్రెయిన్ లో సుమారు 16 వేల మంది భారతీయులు ఉన్నారని భారత్ ప్రకలించింది.

ఉక్రెయిన్ లో చిక్కుకొన్న భారతీయుల తరలింపునకు హంగేరియన్ విదేశాంగ మంత్రి పీటర్ స్జిజార్టో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి KCR ఆదేశాల మేరకు ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులకు సహాయం అందించేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్, రాష్ట్ర సెక్రటేరియట్‌ కార్యాలయంలో హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశారు. ఈ స‌మాచారాన్ని ఓ ప్ర‌క‌ట‌న ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్ వెల్లడించారు.

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు,సెక్రెటరేట్‌లో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ ఐడీల వివరాలను సీఎస్‌ సోమేష్ కుమార్ ప్రకటించారు.

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో..

విక్రమ్​సింగ్​మాన్: +91 7042566955

చక్రవర్తి పీఆర్‌వో: +91 9949351270

నితిన్ వోఎస్డీ : +91 9654663661

ఈమెయిల్ ఐడీ : rctelangana@gmail.com

తెలంగాణ సచివాలయం -హైదరాబాద్

చిట్టిబాబు ఏఎస్‌వో: 040-23220603, +91 9440854433

ఈ-మెయిల్ ఐడీ : e-mail nri@telengana.gov.in లను సంప్రదించాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సూచించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం కూడా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారికోసం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. 


నోడల్ అధికారి రవి శంకర్ - 9871999055 
 
రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్‌ గీతేష్ శర్మ - 7531904820 

ఏపీ ఎన్ఆర్‌టీ సీఈఓ దినేష్ కుమార్ - 9848460046

 కాగా ఉక్రెయిన్ నుంచి తెలంగాణాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 32 మంది విద్యార్థులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న విద్యార్థులను చూసిన తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. 

ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి రష్యన్ దళాలు శుక్రవారం నాడు ప్రవేశించాయి. అయితే రష్యన్ దళాలు  ఉక్రెయిన్ ను తమ ఆధీనంలోకి తీసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. రష్యన్ ను నిలువరిచేందుకు ఉక్రెయిన్ కూడా ప్రయత్నిస్తోంది.

 


 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Harish Rao Comments on Revanth Reddy:టెండర్లురద్దు చేసి సిబిఐవిచారణ జరిపించాలి | Asianet News Telugu
Airport: హైద‌రాబాద్ ఒక్క‌టే కాదు.. ఈ ప్రాంతాల్లో కూడా రియ‌ల్ బూమ్ ఖాయం. కొత్త ఎయిర్ పోర్టులు